News November 12, 2024

రాష్ట్రపతి, గవర్నర్‌కు YCP ఫిర్యాదు

image

AP: తమ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు 100కు పైగా కేసులు నమోదు చేశారని YCP రాష్ట్రపతి, గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో వాక్‌స్వేచ్ఛను అణచివేయడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. కస్టడీలో కార్యకర్తలు ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని తెలిపింది. కల్పిత కేసులు పెడుతున్నారని, ఈ విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నట్లు ట్వీట్ చేసింది.

Similar News

News January 14, 2025

భారత్‌కు నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది అప్పుడే: మోహన్ భగవత్

image

అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన జరిగిన రోజే భారత్‌కు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని RSS చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అందుకే ఆ రోజును ‘ప్రతిష్ఠా ద్వాదశి’గా జరుపుకోవాలని చెప్పారు. రామ మందిర ఉద్యమం ఏ ఒక్కరినీ వ్యతిరేకించడానికి కాదని తెలిపారు. ఈ క్రమంలో భారత్ స్వతంత్రంగా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలబడుతుందని పేర్కొన్నారు. కాగా గత ఏడాది జనవరి 22న రామ విగ్రహ ప్రతిష్ఠ చేసిన సంగతి తెలిసిందే.

News January 14, 2025

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

image

TG: ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు జరిగే కాంగ్రెస్ జాతీయ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత మరుసటి రోజు సింగపూర్ వెళ్లనున్నారు. ఈ నెల 16 నుంచి 19 వరకు అక్కడే పర్యటించనున్నారు. అనంతరం ఈ నెల 20న వరల్డ్ ఎకానమీ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు వెళ్తారు. ఈ నెల 23న తిరిగి హైదరాబాద్ రానున్నారు.

News January 14, 2025

కాంగ్రెస్ పాలనలోని తెలంగాణ పరిస్థితి ఇదే: కేటీఆర్

image

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోని తెలంగాణ పరిస్థితి Kakistocracyగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పదానికి అర్థం పనికిరాని లేదా తక్కువ అర్హత కలిగిన చిత్తశుద్ధి లేని పౌరుల చేతిలో పాలన ఉండటం. బీఆర్ఎస్ నేతల వరుస అరెస్టులను ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.