News May 2, 2024
చంద్రబాబు, పవన్‌పై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఫిర్యాదు

AP: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని YCP నేతలు డిమాండ్ చేశారు. తెనాలి, దెందులూరు సభల్లో చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేశారని YCP MLA మల్లాది విష్ణు ఆరోపించారు. YCP అభ్యర్థులపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అటు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పైనా వారు అసత్య ప్రచారం చేస్తున్నారని విష్ణు మండిపడ్డారు.
Similar News
News April 6, 2026
ఫైటర్ జెట్ కూలిపోయింది కానీ పైలట్లు సేఫ్: US

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో తమ <<19559906>>F-15E<<>> ఫైటర్ జెట్ కూలిపోయిందని అమెరికా ధ్రువీకరించింది. అందులోని ఇద్దరు పైలట్లు ఇరాన్ భూభాగంలో పడిపోగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి విజయవంతంగా వారిని రక్షించామని తెలిపింది. ఇరాన్‌పై తమ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కాగా పైలట్లను రక్షించే క్రమంలో అమెరికా పలు ఎయిర్ క్రాఫ్ట్‌లను కోల్పోయింది.
News April 6, 2026
డీల్ చేసుకోకుంటే.. మొత్తం ఇరాన్‌నే నాశనం చేస్తా: ట్రంప్

ఇరాన్‌తో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. 48 గంటల డెడ్‌లైన్‌ను 82 గంటలకు పొడిగించినట్లు తెలిపారు. మంగళవారం 8 గంటల్లోపు(అమెరికా కాలమానం ప్రకారం) డీల్ చేసుకోవాలని ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ ఒప్పందం చేసుకోకపోతే మొత్తం ఇరాన్‌నే నాశనం చేస్తానని హెచ్చరించారు. దేశంలో పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలు అంటూ ఏవీ మిగలవని స్పష్టంచేశారు.
News April 6, 2026
నిప్పుతో ఆడుకున్నాం.. SRHపై లక్నో ట్రోల్స్

ఇవాళ హైదరాబాద్‌పై విజయం తర్వాత లక్నో ఫ్రాంచైజీ SRHను ట్రోల్ చేస్తూ ఓ పోస్ట్ చేసింది. అందులో షమీ చేతిలో మంటలు ఆర్పే fire extinguisherని ఉంచి ‘ప్లేయిడ్ విత్ ఫైర్’ అని క్యాప్షన్ పెట్టింది. కాగా SRH తమ ప్లేయర్లు ఫైర్ అంటూ తరచూ పోస్టులు చేస్తుండటం తెలిసిందే. అలాగే హైదరాబాద్ బిర్యానీ కంటే లక్నో బిర్యానీ బెటర్ అని మరో పోస్ట్ చేసింది.


