News April 10, 2024
బోగస్ ఓట్లతో గెలిచేందుకు వైసీపీ కుట్ర: కొణతాల

AP: రాష్ట్రంలో బోగస్ ఓట్లతో గెలవాలని వైసీపీ కుట్ర పన్నుతోందని అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు బోగస్ ఓట్లను తొలగించాలని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. గతంలో తిరుపతి ఉపఎన్నికల్లో బోగస్ ఓట్లతో గెలిచారని పేర్కొన్నారు. చాలా చోట్ల డబుల్ ఎంట్రీ, ఒకే ఇంటి నెంబర్‌తో ఓట్లు ఉన్నాయని తెలిపారు.
Similar News
News April 2, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,060
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.13,855
*వెండి 10 గ్రాముల ధర రూ.2,335
News April 2, 2026
పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

ఇరాన్ యుద్ధాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని పొరుగు దేశం(పాకిస్థాన్) కవ్విస్తే అంతకు రెట్టింపు సమాధానం చెబుతామని డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ వార్నింగ్ ఇచ్చారు. కేరళలో సైనిక్ సమ్మేళన్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. Op సిందూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు.
News April 2, 2026
హార్ముజ్‌లో ఇండియన్స్ సేఫ్: ఇరాన్

హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారతీయ నౌకలు, సిబ్బంది భద్రతపై ఇరాన్ భరోసా ఇచ్చింది. ‘మా ఇండియన్ ఫ్రెండ్స్ సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నారు’ అని భారత్‌లోని ఇరాన్ ఎంబసీ ప్రకటించింది. ఇండియాకు రావాల్సిన 19 చమురు నౌకలతో పాటు వేలాది మంది భారత సిబ్బంది యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకుపోయారు. భారత ప్రభుత్వం జరిపిన దౌత్య చర్చల ఫలితంగా ఇప్పటికే కొన్ని నౌకలు సేఫ్‌గా స్వదేశానికి చేరుకున్నాయి.


