News June 5, 2024
YCP ఓటమిని తట్టుకోలేక అభిమానులు మృతి
AP అసెంబ్లీ ఎన్నికల్లో YCP ఘోర ఓటమిని తట్టుకోలేక కొందరు అభిమానులు మృతి చెందారు. కృష్ణా(D) గుడివాడ సైదేపూడికి చెందిన పిట్ట అనిల్(28) జగన్ ప్రభుత్వం, కొడాలి నాని ఓటమి చెందడం తట్టుకోలేక ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు. YSR(D) దిగువ తంబళ్లపల్లెకు చెందిన YCP కార్యకర్త చిన్నయల్లాలు(63) గుండెపోటుతో చనిపోయాడు. కర్నూలు(D) చిన్నతంబళంలోనూ ఉరుకుందప్ప(68) టీవీ చూస్తూ YCP ఓటమిని తట్టుకోలేక తుదిశ్వాస విడిచారు.
Similar News
News November 28, 2024
వీలైనంత త్వరగా పింఛన్ల పెంపు: మంత్రి
TG: దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు వీలైనంత త్వరగా పెంచుతామని మంత్రి సీతక్క అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో దివ్యాంగుల రాష్ట్ర స్థాయి క్రీడలను మంత్రి ప్రారంభించారు. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
News November 28, 2024
ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్!
యూజర్ల సౌలభ్యం కోసం ఇన్స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ తరహాలో IGలోనూ లొకేషన్‌ను షేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం యూజర్లు చాట్‌లోకి వెళ్లిన తర్వాత మెనూబార్‌లో లొకేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కరెంట్ లొకేషన్‌తో పాటు గంటపాటు లైవ్ లొకేషన్‌నూ షేర్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆప్షన్ ప్రస్తుతం కొన్ని దేశాలకే పరిమితం చేసినట్లు మెటా సంస్థ పేర్కొంది. త్వరలో మిగిలిన దేశాలకూ విస్తరించనుంది.
News November 28, 2024
మహారాష్ట్ర CM ఎంపికపై నేడు కీలక భేటీ
మహారాష్ట్ర CM ఎవరనే ప్రశ్నకు నేడు సమాధానం దొరికే అవకాశముంది. ఢిల్లీలో BJP అగ్రనేతలతో ఫడణవీస్, శిండే, అజిత్ పవార్ భేటీ కానున్నారు. CM ఎవరన్నది ‘మహాయుతి’ నేతలు ఈ మీటింగ్‌లో ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. CM, ఇద్దరు dy.CMలు ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఎక్కువ శాతం BJPనే పదవి వరించే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 23న ఎన్నికల ఫలితాలు రాగా, 5 రోజులుగా సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.