News August 12, 2025
ZPTC ఉపఎన్నికలపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికలపై ఎలక్షన్ కమిషన్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. అమరావతిలోని ఈసీ కార్యాలయం ముందు మోకాళ్లపై కూర్చొని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు నిరసన చేపట్టారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని నినదించారు.
Similar News
News August 12, 2025
INDvsENG: చరిత్ర సృష్టించిన సిరీస్

ENG, IND మధ్య జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ రికార్డులు తిరగరాసింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అత్యధిక మంది వీక్షించిన టెస్ట్ సిరీస్‌గా నిలిచింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌ను జియో హాట్‌స్టార్‌లో 17 కోట్ల మంది తిలకించారు. ఐదో టెస్టు చివరి రోజున ఏకకాలంలో రికార్డు స్థాయిలో 1.3 కోట్ల మంది వీక్షించారు. సిరీస్ మొత్తం 65 బిలియన్ మినట్స్ వాచ్ టైమ్‌ను నమోదు చేసింది. కాగా ఈ సిరీస్ 2-2తో సమమైన విషయం తెలిసిందే.
News August 12, 2025
ఆదాయ పరిమితిని బట్టి రిజర్వేషన్లు.. మీ కామెంట్

SC, ST, BC రిజర్వేషన్లలో అంతర్గత ఆదాయ పరిమితి విధించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరించడం చర్చనీయాంశంగా మారింది. ఆయా కులాల్లో డబ్బున్నోళ్లకు రిజర్వేషన్లు ఎందుకన్నదే పిటిషన్ ప్రధానోద్దేశం. BCల్లో క్రీమిలేయర్ ఇలాంటిదే. అయితే SC, STల్లోనూ సంపన్నులకు కాకుండా పేదలకే ఈ ఫలాలు దక్కాలన్నది పిటిషనర్ల వాదన. దీనిపై మీరేమంటారు? కొన్నేళ్లయ్యాక రిజర్వేషన్లు వద్దన్న అంబేడ్కర్ ఆశయాన్ని ఈ వాదన నెరవేర్చేనా?
News August 12, 2025
రష్యా చమురు కొనబోమని భారత్ చెప్పిందా!

రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు నిలిపేస్తే పరిస్థితేంటని అంతటా చర్చిస్తున్నారు. అయితే భారత వైఖరేంటో పట్టించుకోవడమే లేదు. జియో పాలిటిక్స్, స్వప్రయోజనాలు, తక్కువ ధరను బట్టి నచ్చిన మార్కెట్లో కొంటామందే తప్ప రష్యా నుంచి ఆపేస్తామని ఎక్కడా చెప్పలేదు. పైగా అక్కడి నుంచి కొనొద్దని రిఫైనరీలకు ఆదేశాలూ ఇవ్వలేదు. కొన్నాళ్ల కిందట రష్యా వద్ద ధరెక్కువని ఇరాక్, సౌదీ నుంచి దిగుమతులు పెంచుకోవడమే ఇందుకు ఉదాహరణ.