News March 29, 2025
‘వైస్రాయ్’ ఘటనపై వైసీపీ Ghiblistyle ఫొటోలు

వైస్రాయ్ హోటల్ ఘటన APలో అతిపెద్ద రాజకీయ ద్రోహాలలో ఒకటని YCP విమర్శించింది. TDP ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీనియర్ NTRకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన రోజును మరోసారి చూడండి అంటూ <<15920586>>Ghiblistyle<<>> ఫొటోలను షేర్ చేసింది. ‘చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి HYD వైస్రాయ్ హోటల్లో కుట్ర చేశారు. పార్టీని హైజాక్ చేసి NTRను అధికారం నుంచి తొలగించారు. ఈ బాధతోనే ఆయన 1996 జనవరిలో మరణించారు’ అని రాసుకొచ్చింది.
Similar News
News April 1, 2025
WAQF BILL: నేడు బీఏసీ మీటింగ్!

వక్ఫ్ సవరణ బిల్లును ఈ వారంలోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ(BAC) నేడు సమావేశం కానున్నట్లు తెలిసింది. లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు, చర్చించేందుకు షెడ్యూల్ ఖరారు చేయనుంది. కాగా బిల్లుపై వస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. వక్ఫ్ లా అనేది స్వాతంత్ర్యానికి ముందు నుంచే ఉందని, దానిని సవరించడం చట్టవిరుద్ధం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
News April 1, 2025
ALERT: నేడు రాష్ట్రంలో వడగళ్ల వాన

TG: నేటి నుంచి 3 రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 km వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది. గద్వాల్, వనపర్తి, నారాయణపేట్, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షం కురుస్తుందని అంచనా వేసింది.
News April 1, 2025
INDvsENG: ప్రతిష్ఠాత్మక ట్రోఫీకి రిటైర్మెంట్!

ప్రతిష్ఠాత్మక పటౌడీ ట్రోఫీకి రిటైర్మెంట్ ప్రకటించేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సిద్ధమవుతోంది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఇంగ్లండ్లో జరిగే టెస్టు సిరీస్ను 2007 నుంచి పటౌడీ ట్రోఫీ పేరిట నిర్వహిస్తోంది. ఇకపై ఇరు దేశాల్లోని ఇతర దిగ్గజాల పేరిట సిరీస్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జూన్-జులై మధ్య జరిగే సిరీస్ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశముంది. IND తరఫున 46 టెస్టులు ఆడిన పటౌడీ 2011లో మరణించారు.