News July 10, 2024
హార్బర్ల టెండర్లలో YCP గోల్మాల్: అచ్చెన్న
AP: వైసీపీ హయాంలో 5 హార్బర్ల టెండర్లను సొంతవారికే కట్టబెట్టారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. టీడీపీ సానుభూతిపరులకు మత్స్యకార భృతి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ‘మత్స్యకార భృతిపై 20 రోజుల్లో నివేదిక తయారు చేస్తాం. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.10 కోట్ల బకాయి ఉంది. వాటిని త్వరలోనే చెల్లిస్తాం. ప్రస్తుతం మత్స్యశాఖ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 18, 2025
అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ
AP: రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్షాకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఘన స్వాగతం పలికారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంపై కృతజ్ఞతలు తెలిపారు. పలు అంశాలపై చర్చించిన అనంతరం డిన్నర్ చేశారు.
News January 18, 2025
జియో రీఛార్జ్ ప్లాన్.. రూ.49కే..
ప్రముఖ టెలికం కంపెనీ జియో రూ.49కే అన్లిమిటెడ్ డేటాను అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 24 గంటలు. ఒకరోజు అపరిమిత డేటా కావాలనుకునేవారికి ఈ రీఛార్జ్ ప్లాన్ మంచి ఆప్షన్. కానీ ఇందులో కాలింగ్, SMS సౌకర్యం పొందలేరు. రూ.11కే గంటపాటు అన్లిమిటెడ్ డేటా రీఛార్జ్ ప్లాన్ను కూడా Jio తీసుకొచ్చింది. ఇప్పటికే జియో నుంచి తీవ్రపోటీ ఎదుర్కొంటున్న Airtel, VI, BSNLకి ఈ కొత్త ప్లాన్లు మరింత సవాలుగా మారే అవకాశాలున్నాయి.
News January 18, 2025
ODI WC23-CT25 మధ్య జట్టులో మార్పులివే
2023 వన్డే వరల్డ్ కప్కు ఎంపికైన 15 మంది ఆటగాళ్లలో 10 మంది 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోనూ చోటు దక్కించుకున్నారు. సూర్య, ఇషాన్, శార్దుల్, సిరాజ్, అశ్విన్ స్థానాల్లో జైస్వాల్, పంత్, సుందర్, అర్ష్దీప్, అక్షర్ ఎంట్రీ ఇచ్చారు. వీరంతా కూడా జాతీయ జట్టులో ఆడినవారే. ఈసారి కొత్త ముఖాలకు చోటు కల్పించలేదు. ఈ టీమ్ కూర్పు సరిగా లేదని కొందరు విమర్శిస్తుండగా, బాగానే ఉందని పలువురు అంటున్నారు. మీరేమంటారు?