News January 3, 2025
వైసీపీకి 11 సీట్లు.. అందుకే: చింతామోహన్

AP: మాజీ సీఎం జగన్పై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్పై 11 కేసులున్నాయని, అందుకే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని తెలిపారు. ఆయన మీద కేసులు ఎక్కువగా ఉంటే, ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవేమో అని ఎద్దేవా చేశారు. YCPని ప్రజలు పట్టించుకోవడంలేదన్నారు. డబ్బుల కోసం కొందరు కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం చంద్రబాబు స్పందించాలని ఆయన కోరారు.
Similar News
News December 13, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News December 13, 2025
వెనిజుల సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం!

వెనిజుల-అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. వెనిజుల తీరం వెంబడి USకు చెందిన F/A-18 జెట్లు దాదాపు 40 నిమిషాల పాటు తిరిగాయి. అదే విధంగా బాంబర్లు, ఫైటర్ జెట్లు, లాంగ్ రేంజ్ డ్రోన్లు చక్కర్లుకొడుతుండటం ఉద్రిక్తతలకు దారితీసింది. తీరానికి 20 మైళ్ల దూరం వరకు ఇవి వచ్చినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ అక్రమ రవాణా విషయంలో ఆగ్రహంగా ఉన్న ట్రంప్ ఆ దేశంపై <<18453636>>దాడి<<>> చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
News December 13, 2025
SBIలోనూ వడ్డీ రేట్లు తగ్గాయ్

<<18500647>>RBI<<>> రెపో రేటును 0.25% మేర తగ్గించిన నేపథ్యంలో SBI కూడా రుణ రేట్లను సవరించింది. ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్డ్ రేటు(EBLR)ను 7.90 శాతానికి కుదించింది. MCLRను 5 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 8.70 శాతానికి చేరింది. అలాగే 2-3 ఏళ్ల వ్యవధి FD రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.40 శాతానికి, 444 రోజుల కాలవ్యవధి రేటును 6.45 శాతానికి పరిమితం చేసింది. ఈ రేట్లు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయంది.


