News December 13, 2024
పలువురికి పదవులు కేటాయించిన YCP

AP: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(PAC) మెంబర్‌గా YCP నియమించింది. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ CM జగన్ ఆదేశాల మేరకు నియామకం జరిగింది. అటు, వినుకొండ నియోజకవర్గానికి చెందిన పఠాన్ సలేహా ఖాన్‌ను పల్నాడు జిల్లా మైనార్టీ విభాగ అధ్యక్షుడిగా నియమించింది. అలాగే, మైలవరం నియోజకవర్గానికి చెందిన పామర్తి శ్రీనివాసరావును NTR జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ YCP ఉత్తర్వులు జారీ చేసింది.
Similar News
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి రూ.50Cr నష్టపరిహారం ఇప్పించాలన్నారు. నెలకు తనకు రూ.10 లక్షలు మెయింటెనెన్స్ చెల్లించేలా ఆదేశించాలని ముంబై కోర్టును కోరారు. అంతేకాకుండా ముంబైలోని తన నివాసంలోకి హాగ్‌ను ప్రవేశించకుండా ముగ్గురు పిల్లలను తానే చూసుకునే అనుమతివ్వాలన్నారు. దీంతో కోర్టు హాగ్కు నోటీసులు జారీ చేసింది. జైట్లీ, హాగ్ 2011లో పెళ్లి చేసుకున్నారు.