News July 18, 2024

వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది: హోం మంత్రి

image

AP: అత్యాచార ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హోం మంత్రి అనిత తెలిపారు. విద్యార్థులతో పాటు పేరెంట్స్, టీచర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో పోలీసు వ్యవస్థను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. YCP వాళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని, TDP శ్రేణులను కావాలనే రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. TDP, జనసేన శ్రేణులు సంయమనం పాటించాలని కోరారు.

Similar News

News November 27, 2025

వికారాబాద్‌ జిల్లాలో భూప్రకంపనలు

image

TG: వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పూడూరు మండలం రాకంచెర్లలో సెకను పాటు భూమి కంపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్లు గ్రామానికి చేరుకుని ఆరా తీస్తున్నారు.

News November 27, 2025

ధాన్యం కొనుగోళ్లపై వైసీపీ అబద్ధాలు: నాదెండ్ల

image

AP: రైతులకు నష్టం లేకుండా ధాన్యం కొంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 24 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు. అయినా YCP నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ₹1,674 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయిన వాళ్లా రైతుల పక్షాన మాట్లాడేదని మండిపడ్డారు. 8.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. దళారులను నమ్మి రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని కోరారు.

News November 27, 2025

పాక్ న్యూక్లియర్ కంట్రోల్స్ ఆసిమ్ మునీర్ చేతికి!

image

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఆ దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌(CDF)గా బాధ్యతలు చేపట్టారు. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు అతను అధిపతిగా ఉంటారు. ఆ దేశ ప్రధానికి సరిసమానమైన పవర్స్ మాత్రమే కాదు లీగల్ ప్రొటెక్షన్ కూడా ఆసిమ్ మునీర్‌కు ఉంటుందని చెబుతున్నారు. అతనికి కేసుల నుంచి లైఫ్ టైమ్ ఇమ్యూనిటీతో పాటు న్యూక్లియర్ వెపన్స్ కంట్రోల్స్ కూడా అతని చేతికే ఇస్తారని తెలుస్తోంది.