News August 2, 2024
YCPదే బలం.. విజయం ఎవరిదో?

AP: విశాఖ స్థానిక సంస్థల MLC <<13760138>>ఎన్నికలు<<>> ఆగస్టు 30న జరగనున్నాయి. మున్సిపల్ కౌన్సిలర్లు, ZPTC, MPTCలు, ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 841 ఓట్లు ఉన్నాయి. అందులో YCPకి 615 ఓట్ల బలం ఉంటే.. TDP-జనసేన-బీజేపీకి 215 ఓట్లు ఉన్నాయి. 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. YCP బలంగానే కనిపిస్తున్నా.. స్థానిక సంస్థల ప్రతినిధులు అధికార కూటమి వైపు మొగ్గుతారనే ప్రచారం నడుస్తోంది. దీంతో ఈ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.
Similar News
News October 25, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. స్కూళ్లకు సెలవులు

AP: మొంథా తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కృష్ణా జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 27,28,29 తేదీల్లో హాలిడే ఇచ్చారు. తూర్పు గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో 27,28న సెలవు ప్రకటించారు. విద్యార్థులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. కాగా మరికొన్ని జిల్లాల్లోనూ హాలిడేస్ ప్రకటించే అవకాశం ఉంది.
News October 25, 2025
ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకానికి CBN శ్రీకారం

AP: ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీ సొసైటీ ద్వారా బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ స్కీమ్‌ను CM CBN దుబాయ్‌లో ప్రారంభించారు. ‘ఉద్యోగులు, విద్యార్థులు, వలస కార్మికులకు ఇది ప్రయోజనం అందిస్తుంది. బీమా వ్యక్తి ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యం పొందినా ₹10 లక్షలు అందుతుంది. ఈ పథకంలో నమోదు కావడానికి ‘https://apnrts.ap.gov.in/insurance’ వెబ్ సైట్‌ను సందర్శించాలి’ అని I&PR సూచించింది.
News October 25, 2025
HATS OFF: ఎక్కడ తగ్గాడో అక్కడే నెగ్గాడు

AUSతో వన్డే సిరీస్‌లో అదరగొట్టిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ విమర్శకుల నోళ్లు మూయించారు. ఫామ్ లేమితో జట్టు నుంచి తప్పుకున్న చోటే సత్తా చాటి తానేంటో నిరూపించుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో AUSతో టెస్టు సిరీస్‌లో విఫలమైన రోహిత్ కెప్టెన్ అయినప్పటికీ టీమ్ కోసం సిడ్నీ మ్యాచ్ నుంచి వైదొలిగారు. ఇవాళ అదే సిడ్నీలో సూపర్ సెంచరీ(121*)తో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడారు. ఎక్కడ తగ్గారో అక్కడే నెగ్గి చూపించారు.


