News August 11, 2025
ఫ్రీ బస్ స్కీమ్‌ను YCP ఓర్వలేకపోతోంది: మండిపల్లి

AP: రాష్ట్రంలో అమలు కానున్న స్త్రీ శక్తి పథకాన్ని చూసి YCP ఓర్వలేకపోతోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ పథకంపై ఆ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ‘పథకం దీర్ఘకాలం ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. మహిళలు ఎక్కువగా ప్రయాణించే పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, మెట్రో, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో అనుమతిస్తున్నాం. దీంతో లక్షలాది మహిళలు లబ్ధి పొందనున్నారు’ అని పేర్కొన్నారు.
Similar News
News January 21, 2026
టోల్ ఫీ పెండింగ్ ఉంటే వాహన సేవలకు బ్రేక్

హైవేలపై టోల్ చెల్లింపుల విషయంలో కేంద్రం కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. టోల్ ఫీ పెండింగ్ ఉన్న వాహనాలకు ఇకపై వెహికల్ ఓనర్‌షిప్‌కు అవసరమైన NOC, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రెన్యూవల్, నేషనల్ పర్మిట్ లభించదని స్పష్టం చేసింది. చాలా సందర్భాల్లో వాహనదారులకు తెలియకుండానే బకాయిలు ఏర్పడే అవకాశముంది. టోల్‌ప్లాజా వద్ద టెక్నికల్ సమస్యల వల్ల మనీ కట్ అవ్వకపోవడం కూడా టోల్ ఫీ పెండింగ్‌గా చూపించే అవకాశముంది.
News January 21, 2026
రాష్ట్రంలో ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ పార్క్!

ఇజ్రాయెల్ ఆర్థిక, పరిశ్రమల మంత్రి నిర్ బర్కత్, ట్రేడ్ కమిషనర్ రోయ్ ఫిషర్‌తో దావోస్‌లో CM చంద్రబాబు భేటీ అయ్యారు. ‘రక్షణ, ఏరోస్పేస్, UAV పర్యావరణ వ్యవస్థలు, డీశాలినేషన్, సెమీకండక్టర్, క్వాంటం లీడర్‌షిప్, వైద్యం, విద్య, సైబర్ సెక్యూరిటీలో అవకాశాలపై చర్చించాం. మెడ్-టెక్, ఏరో-డిఫెన్స్, క్లీన్-టెక్ కంపెనీలకు ఆతిథ్యమివ్వడానికి రాష్ట్రంలో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని ప్రతిపాదించాను’ అని ట్వీట్ చేశారు.
News January 21, 2026
ఏడేడు జన్మల బంధం సాధ్యమేనా?

భార్యాభర్తల బంధం ఒక్క జన్మకే పరిమితం కాదని పండితులు చెబుతున్నారు. ప్రతి జన్మలోనూ ఒకే వ్యక్తి భాగస్వామిగా రావడం కర్మ సూత్రాల ప్రకారం కష్టమైనప్పటికీ దైవానుగ్రహంతో సాధ్యమేనని వివరిస్తున్నారు. ఓ వ్యక్తి తన భాగస్వామి పట్ల నిష్కల్మష ప్రేమను కలిగి ఉండి, దైవచింతనతో కూడిన కఠినమైన తపస్సు, ప్రత్యేక ఆరాధన చేసినప్పుడు, ఆ భక్తికి మెచ్చి దేవుడు తదుపరి జన్మల్లో కూడా అదే తోడును ప్రసాదిస్తారని పండితుల అభిప్రాయం.


