News September 21, 2025
ఈ నెల 24న వైసీపీ కీలక సమావేశం

AP: వైసీపీ చీఫ్ YS జగన్ అధ్యక్షతన ఈ నెల 24న ఆ పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, సమన్వయకర్తలు హాజరు కానున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 21, 2025
2039లోనూ బీజేపీ పీఎం అభ్యర్థి మోదీనే: రాజ్‌నాథ్

ప్రధాని పదవికి బీజేపీలో ఎలాంటి పోటీ లేదని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. 2029తో పాటు 2039లోనూ బీజేపీ పీఎం అభ్యర్థి మోదీనేనని ఇండియా టుడేతో ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రజలతో మమేకమవ్వడం, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం, సంక్షోభంలోనూ నిర్ణయాత్మకంగా వ్యవహరించడం మోదీకే చెల్లిందని కొనియాడారు. పహల్గాం ఘటనకు స్పందించిన తీరే దీనికి నిదర్శనమని రాజ్‌నాథ్ అన్నారు.
News September 21, 2025
H1B వీసాలపై ఆంక్షలు.. ట్విస్ట్ ఏంటంటే?

కొత్తగా H1B వీసాకు దరఖాస్తు చేసుకునే వారికే <<17767574>>ఫీజు<<>> పెంపు వర్తిస్తుందని వైట్ హౌజ్ అధికారులు చెప్పారని NDTV పేర్కొంది. ప్రస్తుతం ఉన్నవారికి లేదా రెన్యూవల్ చేసుకునే వారిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని వెల్లడించారని తెలిపింది. కాగా మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు H1B, H-4 వీసాలు ఉన్న తమ ఉద్యోగులను 14 రోజుల పాటు దేశం విడిచి వెళ్లవద్దని, ఇప్పటికే బయట ఉంటే వెంటనే వెనక్కి రావాలని ఆదేశించాయి.
News September 21, 2025
‘రంగు రంగు పూలు తెచ్చి రాశులు పోసి’

మహిళా శక్తికి, చైతన్యానికి ప్రతీకగా నిలిచే పండుగ ‘బతుకమ్మ’. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పూల పండుగను మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ప్రకృతి ఇచ్చిన పూలను దేవతగా భావించి ఆరాధిస్తారు. తొలి రోజును చిన్న బతుకమ్మ లేదా ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు. ముందు రోజే సేకరించిన పూలతో బతుకమ్మను తయారు చేయడం, కొన్ని ప్రాంతాల్లో ఆహారం తిన్న తర్వాత తయారు చేయడంతో ఇలా పిలుస్తారని పూర్వీకులు చెబుతారు.