News July 9, 2024
కడప పార్లమెంట్‌కు బైఎలక్షన్ వార్తలను ఖండించిన వైసీపీ నేత

AP: కడప ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక రావొచ్చని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన <<13591234>>వ్యాఖ్యలను<<>> YSR జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేశ్ బాబు ఖండించారు. తప్పుడు కథనాలను పట్టుకుని ఆయన స్పందించడం సిగ్గు చేటన్నారు. బై ఎలక్షన్ వస్తే షర్మిలను గెలిపిస్తానన్న రేవంత్ వ్యాఖ్యలపైనా స్పందిస్తూ.. 2011 కడప పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ‘కడప దెబ్బ ఢిల్లీ అబ్బా’ అనేలా తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు.
Similar News
News October 19, 2025
కొనసాగుతున్న వర్షం.. తగ్గనున్న ఓవర్లు!

భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డేకు వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. భారత స్కోర్ 25-2 ఉన్నప్పుడు వర్షంతో తొలిసారి అంతరాయం కలగ్గా అంపైర్లు మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. తర్వాత 11.5 ఓవర్లలో స్కోర్ 37-3 ఉన్న సమయంలో వర్షం మళ్లీ స్టార్ట్ అయింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే గంటకు పైగా మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో మరిన్ని ఓవర్లు కోల్పోయే అవకాశముంది.
News October 19, 2025
వంటింటి చిట్కాలు

* కూరల్లో గ్రేవీ చిక్కబడాలంటే జీడిపప్పు పొడి, పాలు పోసి కలిపితే సరిపోతుంది.
* డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలంటే కాగిన నూనెలో కాస్త చింతపండు వేయాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసినా నూనె పొంగదు.
* తరిగిన బంగాళదుంపలు రంగు మారకుండా ఉండాలంటే ఆ ముక్కలపై వెనిగర్ చల్లాలి.
* వంకాయ కూరలో కాస్త నిమ్మరసం చేర్చితే కూర రంగు మారదు, రుచి కూడా పెరుగుతుంది.
News October 19, 2025
పండ్ల తోటలు: కొమ్మల కత్తిరింపులో జాగ్రత్తలు

పండ్ల తోటల్లో కొమ్మ కత్తిరింపుల వల్ల సూర్యరశ్మి లోపలి భాగాలకూ చేరి ఎదుగుదల బాగుంటుంది. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కత్తిరింపు పరికరాలను సోడియం హైపో/బ్లీచింగ్ పౌడర్ ద్రావణంలో ముంచిన తర్వాతే వాడుకోవాలి. లేదంటే ఏవైనా వ్యాధులు ఇతర చెట్లకు వ్యాపిస్తాయి. కత్తిరింపులు పూర్తయ్యాక చెట్ల భాగాలకు బ్లైటాక్స్ పేస్ట్/కాపర్ ఆక్సీక్లోరైడ్ పేస్ట్‌తో పూత వేయాలి. అధిక వర్షాలున్నప్పుడు కత్తిరింపులు చేయరాదు.