News November 9, 2024
నేడు డీజీపీని కలవనున్న వైసీపీ నేతలు

AP: వైసీపీ నేతలు ఇవాళ డీజీపీ ద్వారకా తిరుమలరావును కలవనున్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని వారు డీజీపీని కోరతారు. మరోవైపు అవసరమైతే తాము కూడా ప్రైవేట్ కేసులు వేస్తామని వారు హెచ్చరించారు. తమ కార్యకర్తల తరఫున నిలబడి పోరాటం చేస్తామని ప్రకటించారు.
Similar News
News February 12, 2026
‘ఆయుష్’లో త్వరలో 358 పోస్టుల భర్తీ: మంత్రి సత్యకుమార్

AP: ఆయుష్ శాఖలో వివిధ కేటగిరీల్లో నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా 358 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘వీటిలో డాక్టర్, సైకియాట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్, పంచకర్మ థెరపిస్ట్, యోగా ఇన్‌స్ట్రక్టర్, మల్టీపర్పస్ వర్కర్, స్వీపర్ వంటి పోస్టులు ఉన్నాయి. అలాగే 1 ఆయుర్వేద, 3 హోమియో కాలేజీల్లోని 140 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తాం’ అని వివరించారు.
News February 12, 2026
‘వందేమాతరం’ ఆలాపన ఉత్తర్వులపై ముస్లిం బోర్డు అభ్యంతరం

అన్ని స్కూళ్లు, అధికారిక కార్యక్రమాల్లో ‘వందేమాతరం’ గేయంలోని 6 చరణాలను ఆలపించాలని కేంద్రం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ చేసింది. లేదంటే కోర్టులో సవాల్ చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఈ పాటలో దుర్గా, ఇతర దేవతల ఆరాధనకు సంబంధించిన పదాలున్నాయి. అల్లాను మాత్రమే ఆరాధించే ముస్లింల నమ్మకాలకు ఇది విరుద్ధం’ అని పేర్కొంది.
News February 12, 2026
TG CET హాల్ టికెట్లు విడుదల

తెలంగాణ గురుకులం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG CET–2026) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. నేటి నుంచి ఈ నెల 22 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. 2026-27 అకడమిక్ ఇయర్‌కి సంబంధించి 5-9 తరగతుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించనున్నారు. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ <


