News March 16, 2024
YCP LIST: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50% సీట్లు

వైసీపీ అభ్యర్థుల జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50% సీట్లు కేటాయించారు. 84 ఎమ్మెల్యే సీట్లు, 16 ఎంపీ సీట్లు ఈ వర్గాలకు కేటాయించారు. ఎంపీ, ఎమ్మెల్సీ స్థానాలైన 200 సీట్లలో ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59, ఓసీలకు 100 సీట్లు కేటాయించారు. 2019లో మహిళలకు 15 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే, ఈసారి 4 సీట్లు ఎక్కువగా ఇచ్చారు. బీసీలకు 2019లో 41 సీట్లు కేటాయిస్తే, ఈసారి 48 సీట్లు కేటాయించారు.
Similar News
News August 30, 2025
హిందూ ధర్మంలో సంస్కారాలు ఏవి..?

సమాజ హితం, మానవ వికాసం కోసం రుషులు హిందూ ధర్మంలో 16 సంప్రదాయాలను సంస్కారాలుగా గుర్తించారు. అవి.. 1. పెళ్లి, 2. గర్భాధారణ, 3. పుంసవనం, 4. సీమంతం, 5. జాతకర్మ, 6. నామకరణం, 7. అన్నప్రాశన, 8. చూడాకర్మ, 9. నిష్క్రమణ, 10. ఉపనయనం, 11. కేశాంతం, 12. సమావర్తనం, 13. కర్ణభేదం, 14. విద్యారంభం, 15. వేదారంభం, 16. అంత్యేష్టి.
ఈ షోడశ సంస్కారాల విశిష్టతను ఒక్కో రోజు ఒక్కోటిగా తెలుసుకుందాం.
News August 30, 2025
PHOTO OF THE DAY

ప్రపంచ రాజకీయాలను మలుపు తిప్పే భేటీకి రంగం సిద్ధమైంది. చైనాలో రేపు, ఎల్లుండి జరిగే SCO సమ్మిట్ కోసం PM <<17563955>>మోదీ డ్రాగన్<<>> గడ్డపై అడుగుపెట్టారు. చైనా, రష్యా అధ్యక్షులు జిన్‌పింగ్, పుతిన్‌తో భేటీ కానున్నారు. టారిఫ్స్‌తో ఇబ్బంది పెడుతున్న అమెరికాకు ఈ సమావేశంతో చెమటలు పట్టడం ఖాయమని జియో పాలిటిక్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. భారత్, రష్యా, చైనా కలిస్తే ప్రపంచ ముఖచిత్రం మారిపోతుందని అభిప్రాయపడుతున్నారు.
News August 30, 2025
టెన్త్ అర్హతతో 1,266 ఉద్యోగాలు..

ఇండియన్ నేవీలో 1,266 స్కిల్డ్ ట్రేడ్స్‌మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 2 వరకు అవకాశం ఉంది. టెన్త్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నవారు అర్హులు. 18-25 ఏళ్ల మధ్య వయసుండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. పూర్తి సమాచారం కోసం <