News June 28, 2024

హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్లు

image

ఏపీ హైకోర్టులో వైసీపీ మరో రెండు లంచ్ మోషన్ పిటిషన్లను దాఖలు చేసింది. ఉండి, నరసరావుపేటలో వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేసింది. దీనిపై విచారణకు కోర్టు అనుమతిచ్చింది. కాగా ఇప్పటికే పలు జిల్లాలోని 16 వైసీపీ ఆఫీసుల కూల్చివేత చర్యలపై యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Similar News

News February 12, 2026

ఇంగ్లండ్‌పై వెస్టిండీస్ విజయం

image

T20WCలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో వెస్టిండీస్ 30 రన్స్ తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన WI 20 ఓవర్లలో 196 రన్స్ చేసింది. ఛేదనలో సామ్ కరన్(43*), జాకబ్(33), సాల్ట్(30) మినహా మిగతా ఇంగ్లండ్ బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో ఆ జట్టు 166 పరుగులకే ఆలౌటైంది. వెస్టిండీస్ బౌలర్లలో మోటీ 3, ఛేజ్ 2 వికెట్లు తీశారు. అటు హ్యారీ బ్రూక్ కెప్టెన్సీలో T20ల్లో ఇంగ్లండ్‌కు ఇది తొలి ఓటమి.

News February 12, 2026

రేపు నమీబియాతో భారత్ మ్యాచ్.. జట్టు ఇదేనా?

image

T20WCలో భాగంగా రేపు 7pmకు ఢిల్లీ వేదికగా నమీబియాతో భారత జట్టు తలపడనుంది. USAపై గెలుపుతో WCలో బోణీ కొట్టిన ఇండియా రేపటి మ్యాచులోనూ విజయం సాధిస్తామనే ధీమాతో ఉంది. తొలి మ్యాచ్‌లో సూర్య మినహా మిగతా బ్యాటర్లు విఫలం కాగా ఆ తప్పులు రిపీట్ కాకుండా చూసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
జట్టు అంచనా: అభిషేక్/శాంసన్, కిషన్, తిలక్, సూర్య, దూబే, హార్దిక్, రింకూ, అక్షర్, అర్ష్‌దీప్, వరుణ్, బుమ్రా.

News February 11, 2026

విద్యుత్ శాఖలో అతిత్వరలో నియామకాలు: గొట్టిపాటి

image

AP: విద్యుత్ ఉద్యోగుల‌పై ప‌ని ఒత్తిడిని త‌గ్గించేందుకు అతి త్వరలోనే నియామకాలు చేపడుతున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఉద్యోగుల డిమాండ్ల‌లో 90 శాతానికి పైగా ప‌రిష్క‌రించామన్నారు. ప్ర‌జ‌ల్లో సంతృప్తి స్థాయులు పెరిగేలా విధులు నిర్వ‌ర్తించాలని బీసీ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో తెలిపారు. మెడిక‌ల్ ఇన్సూరెన్స్ లిమిట్‌కు సంబంధించి స‌మ‌స్య‌లుంటే ప‌రిష్కారం దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని చెప్పారు.