News March 18, 2024

వైసీపీ మేనిఫెస్టో ప్రకటన వాయిదా!

image

AP: ఈనెల 20న జరగాల్సిన వైసీపీ మేనిఫెస్టో ప్రకటన కార్యక్రమం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ‘జగన్ చెప్పాడంటే.. చేస్తాడంతే అనే నమ్మకం’ పేరుతో మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రైతులు, కార్మికులు, వృద్ధులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Similar News

News January 6, 2026

విజయవాడ ఎందుకో వెనకబడింది!

image

కూటమి పాలనలో వైజాగ్, తిరుపతికి IT, ఇతర కంపెనీలు వస్తున్నాయి. రాజధాని విజయవాడకు మాత్రం మొండిచేయే మిగులుతోంది. విద్యాకేంద్రంగా ఉన్న నగరంలో ఉపాధి కరువై లక్షలాది మంది యువత పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. అటు కొత్త పరిశ్రమలు రాక, ఇటు మురుగు, తాగునీటి సమస్యలు పరిష్కారం కాక నగరం అస్తవ్యస్తంగా మారింది. అభివృద్ధిని విస్మరించిన ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై నగరవాసుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.

News January 6, 2026

‘కార్తీక దీపం’ విషయంలో సంచలన తీర్పు

image

తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించడానికి మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ అనుమతించింది. ఏకసభ్య ధర్మాసనం నిర్ణయాన్ని జస్టిస్ జయచంద్రన్, జస్టిస్ రామకృష్ణన్ సమర్థించారు. ‘అక్కడ దీపం వెలిగించకూడదు అనడానికి పిటిషనర్లు ఆధారాలు చూపలేకపోయారు. ఏడాదికి ఒక్కసారి దీపం వెలిగిస్తే శాంతికి విఘాతం కలుగుతుందనడం హాస్యాస్పదం. ప్రభుత్వ మద్దతుంటేనే ఇలాంటి గందరగోళం జరుగుతుంది’ అని అసహనం వ్యక్తం చేశారు.

News January 6, 2026

అరవై ఐదేళ్ల వయసులో ఆటో రయ్ రయ్..

image

మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నివసించే మంగళ ఆజీ 65 ఏళ్ల వయసులో చలాకీగా ఆటో నడుపుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. పిల్లల చిన్నతనంలోనే భర్త మరణిస్తే కూలి పనులు చేసి పిల్లలను చదివించారు. ఇప్పుడు పిల్లలు స్థిరపడిన తర్వాత మంగళ ఆజీ ఎవరిపై ఆధారపడకుండా ఆటో నడుపుతూ రోజుకు 500-700 వరకు సంపాదిస్తున్నారు. 15రోజుల్లోనే ఆటో నడపడం నేర్చుకున్న ఆమె ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.