News April 24, 2024

ఈ నెల 26న వైసీపీ మేనిఫెస్టో?

image

AP: వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 26న తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశంపై జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉండగా.. మహిళలు, యువత, రైతులను దృష్టిలో పెట్టుకుని పలు జనాకర్షక పథకాలను ప్రకటిస్తారని సమాచారం.

Similar News

News November 20, 2024

వార్నర్‌తో వివాదాన్ని ముగిస్తా: జాన్సన్

image

ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌తో వివాదాన్ని ముగిస్తానని ఆ జట్టు మాజీ బౌలర్ మిచెల్ జాన్సన్ తెలిపారు. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో వీరిద్దరూ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలోనే పాత వివాదానికి ఫుల్ స్టాప్ పెడతానని జాన్సన్ అన్నారు. వార్నర్‌కు ఆస్ట్రేలియా బోర్డు ఫేర్‌వెల్ టెస్ట్ కేటాయించినప్పుడు.. బాల్ ట్యాంపరింగ్‌ నిందితుడికి ఇలాంటివెందుకంటూ జాన్సన్ మండిపడ్డారు.

News November 20, 2024

అభివృద్ధిని అడ్డుకునేందుకు కాళ్లలో కట్టెలు పెడుతున్నారు: రేవంత్

image

TG: పదేళ్లలో KCR చేయలేని పనులను తాము పూర్తి చేస్తున్నామని CM రేవంత్ అన్నారు. KCR ఫామ్‌హౌస్‌లో పడుకుంటే KTR, హరీశ్ మన కాళ్ల మధ్య కట్టెలు పెట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. BRS సరిగా పరిపాలన చేసి ఉంటే రైతు రుణమాఫీ చేయాల్సి వచ్చేదా? అని ప్రశ్నించారు. రూ.11వేల కోట్ల రుణమాఫీకి KCR పదేళ్లు తీసుకుంటే, తాము 25 రోజుల్లో రూ.18వేల కోట్లు మాఫీ చేశామని వేములవాడ సభలో CM స్పష్టం చేశారు.

News November 20, 2024

జపాన్‌లో తొలి మూడేళ్లు పిల్లలకు పరీక్షలే ఉండవు!

image

పిల్లలు పుట్టగానే వారిని ఇంజినీర్ లేదా డాక్టర్ చేయించాలని చాలా మంది అనుకుంటుంటారు. రూ.లక్షలు చెల్లించి స్కూల్‌లో జాయిన్ చేయించి మార్కులు, గ్రేడ్స్ అంటూ వారిని అప్పటి నుంచే ఇబ్బంది పెడుతుంటారు. కానీ, జపాన్‌లో అలా కాదు. అక్కడి పిల్లలకు స్కూల్‌లో మొదటి మూడేళ్లు పరీక్షలు, గ్రేడ్స్ ఉండవు. కేవలం మంచి మర్యాదలు నేర్పిస్తారు. ఒకరినొకరు గౌరవించుకోవడం, ఉదారంగా ఉండటం, ప్రకృతి పట్ల దయగా ఉండటం నేర్పిస్తారు.