News April 11, 2024

ఫేక్ వీడియోలతో YCP గందరగోళం: చంద్రబాబు

image

AP: జగన్‌ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించారని TDP అధినేత చంద్రబాబు జోస్యం చెప్పారు. ‘అందుకే YCP నేతలు ఫేక్ వీడియోలతో గందరగోళం సృష్టిస్తున్నారు. ఈ దుస్థితికి దిగజారారు. YCP ఫేక్ ప్రచారాలను దీటుగా తిప్పికొట్టాలి. వాలంటీర్లను YCP నేతలు బానిసలుగా మార్చుకున్నారు. వారితో తప్పుడు పనులు చేయించి జైలుకు పంపాలని చూస్తున్నారు. YCP విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలి’ అని పార్టీ శ్రేణులకు బాబు పిలుపునిచ్చారు.

Similar News

News March 11, 2026

LPG (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) ఎలా తయారు చేస్తారు?

image

LPG ప్రొపేన్, బ్యూటేన్ వాయువుల మిశ్రమం. దీనిని 2 విధాలుగా (నేచురల్ గ్యాస్ ప్రాసెసింగ్, క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్) తయారు చేస్తారు. ముందుగా సహజ వాయువు/ముడి చమురు నుంచి ప్రొపేన్, బ్యూటేన్‌ను వేరు చేస్తారు. వీటిలోని నీరు, హైడ్రోజన్ సల్ఫైడ్, CO2 తొలగిస్తారు. తర్వాత ద్రవ రూపంలోకి మార్చి లీకేజీని గుర్తించేలా వాసన గల రసాయనాన్ని(ఈథైల్ మెర్కాప్టన్) కలుపుతారు. తర్వాత బాట్లింగ్ ప్లాంట్లలో సిలిండర్లలో నింపుతారు.

News March 11, 2026

ఐపీఎల్-26కు రూ.18కోట్ల ప్లేయర్ దూరం?

image

IPL మినీ వేలంలో రెండో అత్యధిక ధర(₹18Cr) పలికిన శ్రీలంక పేసర్ పతిరణ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ఈనెల 28 నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా ఆయన ఇంకా KKR జట్టులో చేరలేదని Cricbuzz పేర్కొంది. SL క్రికెట్ బోర్డు సెంటర్‌లో కోలుకుంటున్నట్లు తెలిపింది. పతిరణ ఎడమ కాలు కండరాల నొప్పితో టీ20 WC నుంచి మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే. IPLలో ఆయన CSK తరఫున 32 మ్యాచుల్లో 47 వికెట్లు తీశారు.

News March 11, 2026

‘RC17’పై బిగ్ అప్‌డేట్ ఎప్పుడు?

image

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించబోయే సినిమా గురించి బిగ్ అప్‌డేట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నెల 27న చరణ్ బర్త్‌డే సందర్భంగా ఏదైనా పెద్ద ప్రకటన ఉండొచ్చని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సుకుమార్ స్టోరీని రెండు వెర్షన్‌లుగా సిద్ధం చేశారని, చరణ్‌తో చర్చించి ఒక దానిని ఫైనల్ చేయాల్సి ఉందని టాక్ వినిపిస్తోంది. కాగా ప్రస్తుతం RC నటిస్తున్న ‘పెద్ది’ మూవీ APR 30న రిలీజ్ కానుంది.