News March 18, 2024

టిప్పర్ డ్రైవర్‌కు YCP ఎమ్మెల్యే టికెట్

image

AP: శింగనమల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టిప్పర్ డ్రైవర్‌ వీరాంజనేయులుకు పార్టీ టికెట్ కేటాయించింది. ఈయన దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. అలాగే మడకశిర అభ్యర్థి ఈర లక్కప్ప ఉపాధి కూలీ. ఆయన ఇప్పటికీ పక్కా గృహంలో నివసిస్తున్నారు. మరోవైపు మైలవరం అభ్యర్థిగా ప్రకటించిన సర్నాల తిరుపతిరావు సామాన్య రైతు. 2021లో జడ్పీటీసీగా గెలుపొందారు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు.

Similar News

News July 8, 2024

భూమన, ధర్మారెడ్డిపై టీడీపీ నేతల ఫిర్యాదు

image

AP: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిపై సీఎస్ నీరభ్ కుమార్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వారిద్దరూ ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించారని, అక్రమాలు చేశారని చెప్పారు. శ్రీవారిని దర్శించుకునే వ్యాపారవేత్తలతో ధర్మారెడ్డి వైసీపీకి విరాళాలు ఇప్పించారని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై సీఐడీ, విజిలెన్స్ శాఖతో విచారణ జరిపించాలని కోరారు.

News July 8, 2024

YELLOW ALERT.. భారీ వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. మిగతా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News July 8, 2024

‘స్కిల్ యూనివర్సిటీ’ ఏర్పాటుపై సీఎం రేవంత్ ఆదేశాలు

image

TG: స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. దీనిని గచ్చిబౌలి ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ESCIలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్‌ను పరిశీలించిన అనంతరం పారిశ్రామిక ప్రముఖులతో CM చర్చలు జరిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు ఉద్యోగావకాశాలు లభించేలా వర్సిటీలో కోర్సులు ఉండాలని సూచించారు.