News March 20, 2025

YCP MLAలు దొంగచాటుగా సంతకాలు పెడుతున్నారు: అయ్యన్న

image

AP: YCP సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్న అసహనం వ్యక్తం చేశారు. ఆ పార్టీ MLAలు దొంగచాటుగా వచ్చి రిజిస్టర్‌లో సంతకాలు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నలు అడుగుతున్నారే తప్ప సభకు రావట్లేదన్నారు. దొంగచాటుగా, దొంగల మాదిరి వచ్చి సంతకాలు పెట్టడం ఏంటి? అని నిలదీశారు. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఎన్నికైన సభ్యులు సగర్వంగా సభకు రావాలని సూచించారు.

Similar News

News March 21, 2025

‘కోర్టు’ నటుడితో దిల్ రాజు మూవీ?

image

‘కోర్టు: స్టేట్vsనోబడీ’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు హర్ష్ రోషన్‌తో దిల్ రాజు సినిమా తీయనున్నట్లు సమాచారం. దీనికి ‘తెల్ల కాగితం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రమేశ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తారని టాలీవుడ్ టాక్. ఇందులో శివాజీ కీలక పాత్ర పోషిస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన కోర్టు మూవీ భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.

News March 20, 2025

ఫోన్ పే, గూగుల్ పే ఉపయోగిస్తున్నారా?

image

ఏప్రిల్ 1 నుంచి NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొత్త మార్గదర్శకాలు అమలు చేయనుంది. ఈ రూల్స్ ప్రకారం డియాక్టివేట్, సరెండర్ చేసిన మొబైల్ నంబర్లను ఈ నెల 31లోగా తొలగించాలని బ్యాంకులను ఆదేశించింది. ఆ తర్వాత ఈ నంబర్లను ఉపయోగించి ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలు పొందలేరని తెలిపింది. అప్డేట్ చేసిన మొబైల్ నంబర్‌ సిస్టమ్‌ను ఉపయోగించి ట్రాన్సాక్షన్ల సంఖ్యను పేర్కొనాలని సూచించింది.

News March 20, 2025

మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాడ్స్.. స్పందించిన ఎన్వీఎస్ రెడ్డి

image

TG: మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాడ్స్ విషయం తన దృష్టికి వచ్చిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. తక్షణమే ఆ ప్రకటనలను తొలగించాల్సిందిగా సంబంధిత యాడ్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇలాంటి ప్రకటనలు అనైతికమని, ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇకపై ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న యాడ్స్‌ను మెట్రోలో నిషేధిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

error: Content is protected !!