News February 12, 2025
పవన్‌పై వైసీపీ ఎమ్మెల్యే విమర్శలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739344373859_1226-normal-WIFI.webp)
AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ విమర్శనాస్త్రాలు సంధించారు. నిన్న అనారోగ్య సమస్యలతో సీఎం చంద్రబాబు కాల్‌కు రెస్పాండ్ అవ్వని పవన్ ఇవాళ తీర్థయాత్రలకు వెళ్లడం కూటమి ప్రభుత్వానికి ఆనందం తెప్పిస్తోందని సెటైర్ వేశారు. బడ్జెట్‌కు ముందు కీలకమైన సమావేశాలకూ PK డుమ్మా కొట్టారని విమర్శించారు. కాగా దక్షిణాది ఆలయాల పర్యటనలో ఉన్న పవన్ ఇవాళ ఉదయం కేరళలోని పలు దేవాలయాలను సందర్శించారు.
Similar News
News February 12, 2025
శుభ్‌మన్ గిల్ ‘శతక’బాదుడు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739354607046_1045-normal-WIFI.webp)
భారత స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో సెంచరీతో కదం తొక్కారు. 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇది ఆయనకు 7వ వన్డే సెంచరీ. ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో గిల్ 87, 60 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే. కాగా.. భారత్ స్కోరు ప్రస్తుతం 206/2గా ఉంది. మరో ఎండ్‌లో శ్రేయస్ అయ్యర్ 43(36 బంతుల్లో) కూడా ధాటిగా ఆడుతున్నారు.
News February 12, 2025
ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. సిఫీకి లోకేశ్ ఆహ్వానం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739353277320_1045-normal-WIFI.webp)
AP: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సిఫీ టెక్నాలజీస్ ఎండీ రాజు వేగేశ్నను మంత్రి నారా లోకేశ్ కోరారు. ఉండవల్లిలోని తన నివాసంలో రాజుతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైజాగ్‌లో మెగా డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుపై చర్చించారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి వివరించారు. ఏపీలో పెట్టుబడికి తాము సుముఖంగా ఉన్నట్లు రాజు లోకేశ్‌కు తెలిపారు.
News February 12, 2025
Gold Bars అమ్మకాలు నిలిపివేత.. ఎక్కడంటే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739352668659_1199-normal-WIFI.webp)
బంగారం ధరలు పెరుగుతున్న వేళ సౌత్ కొరియా అనూహ్య నిర్ణయం తీసుకుంది. అక్కడి మింటింగ్ కార్పొరేషన్ గోల్డ్‌బార్స్ అమ్మకాలను నిలిపివేసింది. Feb 11న కమర్షియల్ బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాని ముడిసరుకు సేకరించడం కష్టంగా మారింది. అందుకే గోల్డ్ బార్స్ అమ్మకాలు ఆపేశాం. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో తెలియదు’ అని పేర్కొంది. ప్రస్తుతం Hydలో గోల్డ్ 10gr ధర రూ.87k ఉంది.