News July 25, 2024
YCP ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోబోమని చెప్పా: ఆదినారాయణ రెడ్డి

AP: వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఓ రాయలసీమ నేత తనతో చెప్పారని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. ‘జగన్ తప్ప మిగిలిన ఎమ్మెల్యేలందరినీ తీసుకొస్తా. మీరు బీజేపీలో చేర్చుకోండి అని వేడుకున్నాడు. నేను కుదరదని చెప్పా. వాళ్లను చేర్చుకుంటే వాళ్లు చేసిన తప్పులకు మేం బాధ్యులం అవుతాం కదా అని వద్దని చెప్పా’ అని మీడియాతో చిట్‌చాట్‌లో తెలిపారు.
Similar News
News December 12, 2025
పొగమంచు వేళల్లో వాహనాల రాకపోకలపై నిషేధం: అనిత

AP: ఏజెన్సీ ప్రాంతాల్లో వాహన ప్రమాదాల నేపథ్యంలో రాత్రి పూట పొగమంచు వేళల్లో బస్సు, ఇతర వాహన రాకపోకలను నిషేధిస్తున్నట్లు మంత్రి అనిత తెలిపారు. చింతూరు-మారేడుమిల్లి రోడ్డులో BUS ప్రమాదంలో 9మంది మృతి బాధాకరమన్నారు. ‘మృతుల కుటుంబాలకు పరిహారమిస్తాం. ఘాట్ రోడ్లలో వాహనాలు నడిపేవారికి ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్ ఉండేలా చర్యలు తీసుకుంటాం. చిన్న తప్పిదాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు.
News December 12, 2025
NHIDCL 64 పోస్టులకు నోటిఫికేషన్

<
News December 12, 2025
సుదీర్ఘ నిరీక్షణకు తెర.. రేపటి నుంచి ‘డ్రాగన్’ షూటింగ్!

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ ఎట్టకేలకు తిరిగి ప్రారంభంకానుంది. ఏప్రిల్‌లో 2 వారాల షూటింగ్ తర్వాత 6నెలలు గ్యాప్ ఇచ్చిన మేకర్స్ రేపటి నుంచి చిత్రీకరణలో బిజీ కానున్నారు. మూడు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్లో కీలక సీన్లు, సాంగ్‌ను చిత్రీకరించనున్నారు. రెండు పార్టుల షూటింగ్‌ను ఒకేసారి పూర్తిచేసి తొలి భాగాన్ని 2026 DECలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.


