News July 12, 2024

టీడీపీవైపు చూస్తున్న వైసీపీ ఎమ్మెల్సీలు?

image

AP: పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ కీలక నేతలు, మంత్రులను కలిసి చర్చించినట్లు సమాచారం. శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానం బుధవారం మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరో నలుగురు ఎమ్మెల్సీలు సైతం టీడీపీతో టచ్ ఉన్నట్లు సమాచారం. కాగా మండలిలో వైసీపీకి 38 మంది, టీడీపీకి 9, జనసేనకు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు.

Similar News

News December 13, 2025

మాటలతో యుద్ధాలు గెలవలేం: CDS అనిల్ చౌహాన్

image

దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పాకిస్థాన్‌కు పరోక్షంగా గట్టి సందేశం ఇచ్చారు. మాటలతో యుద్ధాలు గెలవలేమని, స్పష్టమైన టార్గెట్, చర్యలే విజయాన్ని అందిస్తాయని అన్నారు. సైన్యం నిబద్ధతలోనే భారత్‌ బలం దాగి ఉందని స్పష్టం చేశారు. యుద్ధ స్వరూపం మారుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా సిద్ధమవుతున్నామన్నారు.

News December 13, 2025

వంటింటి చిట్కాలు

image

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.

News December 13, 2025

అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

image

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్‌లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.