News December 6, 2024
ఈనెల 13 నుంచి వైసీపీ ఉద్యమబాట

AP: ఈనెల 13 నుంచి వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. 13న రైతు సమస్యలపై, ఈనెల 27న కరెంటు ఛార్జీల మోతపై, 2025 జనవరి 3న విద్యార్థులకు బాసటగా ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపింది. వీటితో పాటు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేయనున్నట్లు పేర్కొంది. సంక్రాంతి నుంచి వైఎస్ జగన్ జనంలోకి వస్తారని తెలిపింది.
Similar News
News November 15, 2025
రాజకీయాలు, కుటుంబానికి గుడ్‌బై: లాలూ కూతురు

బిహార్ మాజీ సీఎం, RJD పార్టీ ప్రెసిడెంట్ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాలతో పాటు కుటుంబంతో బంధాన్ని తెంచుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. సంజయ్ యాదవ్, రమీజ్ పార్టీ నుంచి వెళ్లిపోమని తనతో చెప్పారని, మొత్తం నింద తానే తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో రోహిణి తన తండ్రి లాలూకు కిడ్నీ దానం చేసిన విషయం తెలిసిందే.
News November 15, 2025
తండ్రయిన రాజ్‌కుమార్

బాలీవుడ్ స్టార్ కపుల్ రాజ్‌కుమార్ రావు-పత్రలేఖ తల్లిదండ్రులయ్యారు. ఇవాళ వారి నాలుగో వివాహ వార్షికోత్సవం రోజునే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్, పలువురు నటీనటులు శుభాకాంక్షలు తెలిపారు. 2010లో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన రాజ్.. స్త్రీ2 చిత్రంతో ఇండస్ట్రీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. పత్రలేఖ కూడా పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించారు.
News November 15, 2025
ఊడ్చే యంత్రాల అద్దె ఖరీదు తెలిస్తే షాకే!

బెంగళూరు రోడ్లను ఊడ్చేందుకు స్వీపింగ్ యంత్రాలను మరిన్ని అందుబాటులో ఉంచాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. 46 స్వీపింగ్ యంత్రాలను ఏడేళ్ల పాటు అద్దెకు తీసుకునేందుకు ఏకంగా రూ.613కోట్లను కేటాయించింది. శుభ్రతపై కర్ణాటక ప్రభుత్వ చొరవ అభినందనీయమే అయినా అంత డబ్బు అద్దెకు ఖర్చు చేయడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. కొనుగోలు చేసినా ఇంత ఖర్చవదేమో.. ఎందుకంత డబ్బుల్రా బుజ్జీ అంటూ సెటైర్లు వేస్తున్నారు.


