News October 29, 2024
విద్యుత్ ఛార్జీల పెంపునకు వైసీపీ విధానాలే కారణం: అనగాని

AP: వైసీపీ నాయకులు కేసులు, బెయిల్ కోసం ఢిల్లీ వెళ్లేవారని, సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం వెళ్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. ప్రస్తుతం విద్యుత్ ఛార్జీలు పెంచడానికి గత ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ ‘రీసర్వే పూర్తయ్యాక జిల్లాల పునర్విభజనపై దృష్టిసారిస్తాం. పార్టీలో అర్హులైన వారికి త్వరలో నామినేటెడ్ పదవులు వస్తాయి’ అని తెలిపారు.
Similar News
News October 29, 2024
రోహిత్ అద్భుతమైన నాయకుడు: శిఖర్ ధవన్

టీమ్ ఇండియాను నడిపించడంలో రోహిత్ శర్మ అద్భుతంగా పనిచేస్తున్నారని మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ కొనియాడారు. ‘గెలుపోటములే కెప్టెన్సీకి కొలమానాలు కాదు. జట్టులో నాయకుడికి ఉండే గౌరవం, బంధం వంటివన్నీ కీలకమే. న్యూజిలాండ్ సిరీస్ ఓడినంత మాత్రాన భారత జట్టు స్థాయి తగ్గిపోలేదు. మన ఆటగాళ్లందరూ చాలా ప్రొఫెషనల్స్. ఆస్ట్రేలియా సిరీస్లో కచ్చితంగా పుంజుకుంటారు’ అని ధీమా వ్యక్తం చేశారు.
News October 29, 2024
భారత్లో యువ కుబేరులు వీరే

భారత్లో యువ వ్యాపారవేత్తలు, వారి సంస్థలు-ఆస్తుల్ని చూస్తే.. నితిన్ కామత్(జెరోదా-రూ. 22,526 కోట్లు), భవీశ్ అగర్వాల్ (ఓలా-రూ.21వేల కోట్లు), రితేశ్ అగర్వాల్ (ఓయో-రూ.16వేల కోట్లు), కునాల్ షా(క్రెడ్-రూ.15 వేల కోట్లు), దీపేందర్ గోయల్(జొమాటో-రూ.8,300 కోట్లు), అభీందర్ థిండ్సా(బ్లింకిట్-రూ.2400 కోట్లు), అమన్ గుప్తా(బోట్-రూ.720 కోట్లు), పీయూష్ బన్సల్(లెన్స్కార్ట్- రూ.600 కోట్లు).
News October 29, 2024
మీ బ్యాంక్ అకౌంట్లను ఎవరికీ అమ్మొద్దు: కేంద్రం

నేరపూరిత అక్రమార్జనకు పలువురు నకిలీ బ్యాంకు ఖాతాలను వాడుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. AP, గుజరాత్ పోలీసుల తనిఖీల్లో ఈ విషయం బయటపడినట్లు తెలిపింది. ప్రజలెవరూ తమ బ్యాంకు అకౌంట్లను ఇతరులకు అమ్మడం/అద్దెకు ఇవ్వొద్దని సూచించింది. ఆ ఖాతాల్లో అక్రమ నగదు చేరితే అరెస్టుతోపాటు చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది హెచ్చరించింది. ఏదైనా సమస్య వస్తే 1930 లేదా www.cybercrime.gov.inలో రిపోర్ట్ చేయాలంది.