News July 18, 2024
#SaveAPFromTDP అంటూ వైసీపీ పోస్టులు
ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని వైసీపీ మండిపడుతోంది. #SaveAPFromTDP హ్యాష్‌ట్యాగ్‌తో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు Xలో పోస్టులు చేస్తున్నారు. ‘రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైసీపీ సానుభూతిపరులను ఘోరంగా చంపుతోంది. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి’ అంటూ ఫైరవుతున్నారు.
Similar News
News January 24, 2025
భారతీయులకు బిగ్ రిలీఫ్
అమెరికాలో జన్మత: వచ్చే పౌరసత్వాన్ని కొత్త అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేయడంతో అక్కడి భారతీయుల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా, అధ్యక్షుడి నిర్ణయాన్ని సియాటెల్ జడ్జి తాత్కాలికంగా నిలిపేయడంతో వారికి ఊరట దక్కినట్లైంది. ఫిబ్రవరి 20 తర్వాత పుట్టిన వారికి సిటిజన్ షిప్ రాదనే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇండియన్స్‌తో పాటు USAకు వలస వెళ్లిన వారిని టెన్షన్ పెట్టిన విషయం తెలిసిందే.
News January 24, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News January 24, 2025
ట్రంప్‌నకు షాక్.. జన్మత: పౌరసత్వం రద్దు నిర్ణయం నిలిపివేత
USAలో జన్మత: వచ్చే <<15211801>>పౌరసత్వాన్ని<<>> రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్‌నకు షాక్ తగిలింది. ఈ మేరకు ఆయన జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు సియాటెల్ కోర్టు జడ్డి జాన్ కఫెనర్ ప్రకటించారు. ఆ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆర్డర్‌ను సవాల్ చేస్తూ పలు రాష్ట్రాలు కోర్టులకెక్కిన విషయం తెలిసిందే. ట్రంప్ ఆర్డర్ ప్రకారం USAకు వలస వెళ్లిన వారికి పిల్లలు పుడితే పౌరసత్వం రాదు.