News February 25, 2025
వీసీలకు బెదిరింపులంటూ వైసీపీ ‘ట్రూత్ బాంబ్’ పోస్ట్

AP: వీసీలను బెదిరించి రాజీనామా చేయించారని మండలిలో YCP నేతలు ఆరోపించారు. ఆధారాలుంటే చూపాలని మంత్రి లోకేశ్ సవాల్ విసరగా YCP స్పందించింది. ఛైర్మన్ మౌఖికంగా ఆదేశించడంతో తాను రాజీనామా చేస్తున్నట్లు సింహపురి వర్సిటీ VC సుందరవల్లి రాసిన లేఖను Xలో పోస్టు చేసింది. ‘ఇదిగో ఆధారాలు బయటపెట్టాం. నిజాయితీ ఉంటే VCల రిజైన్పై న్యాయబద్ధ విచారణ చేయించాలి. లేదంటే లోకేశ్ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేసింది.
Similar News
News December 22, 2025
గ్రామ ప్రియ కోళ్ల గురించి తెలుసా?

గ్రామ ప్రియ కోళ్లు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే గ్రామ ప్రియ కోళ్లు పెరటి పెంపకానికి ఎంతో అనువైనవి. వీటి గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. ఇవి ఆరు నెలల వయసు వచ్చేసరికే రెండున్నర కేజీల వరకు బరువు పెరుగుతాయి. ఏడాదిలో 250 గుడ్లను పెడతాయి. అధిక వ్యాధినిరోధక శక్తిని కలిగి ఉండటం వల్ల త్వరగా జబ్బుల బారిన పడవని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు.
News December 22, 2025
Baaaaahubali.. టెస్టింగ్ OK.. 24న టెస్ట్!

శ్రీహరికోట నుంచి ISRO బాహుబలి రాకెట్ LMV-3 ఈనెల 24న తన 6వ స్పేస్ ట్రిప్ చేపట్టనుంది. AST స్పేస్ మొబైల్ (USA) సంస్థ 6100 కేజీల భారీ Blue Bird బ్లాక్2 శాటిలైట్ను కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఆదివారం రిహార్సల్స్ పూర్తయ్యాయి. ఇస్రో ఛైర్మన్ నారాయణన్ ఇవాళ రెడీనెస్ రివ్యూ చేస్తారు. భారత్ లాంఛ్ చేస్తున్న అత్యంత బరువైన పేలోడ్ ఇదే. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఇస్రోకు ఇది అత్యంత లాభదాయక కమర్షియల్ డీల్ అవుతుంది.
News December 22, 2025
నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

AP: మంగళగిరిలో ఇవాళ జనసేన పార్టీ 3 వేలమందితో ‘పదవి-బాధ్యత’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. కూటమి ప్రభుత్వంలో జనసేన తరఫున నామినేటెడ్ పదవులు పొందినవారు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వారితో పార్టీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమై దిశానిర్దేశం చేస్తారని జనసేన వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.


