News April 4, 2024
నేడు వైసీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

AP: వైసీపీ రాజ్యసభ సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గొల్ల బాబూరావు, మేడా రఘునాథ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. వీరితో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రమాణం చేయించనున్నారు. కాగా రాజ్యసభలో ఏపీకి ఉన్న 11 సీట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్లాయి. తొలిసారి ఎగువ సభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
Similar News
News February 22, 2025
మాటలకందని గౌరవమిది: మోదీకి విక్కీ కౌశల్, రష్మిక మందన్న రిప్లై

దేశవ్యాప్తంగా ‘ఛావా’ <<15542065>>గాలి<<>> వీస్తోందన్న PM మోదీకి ఆ చిత్ర నటీనటులు ధన్యవాదాలు తెలియజేశారు. శంభాజీ పాత్రలో వీర, శూర, రౌద్ర రసాలు ఒలికించిన విక్కీ కౌశల్ ‘మాటల్లో వర్ణించలేని గౌరవమిది. నరేంద్ర మోదీజీకి కృతజ్ఞతలు’ అని పోస్ట్ పెట్టారు. యేసుభాయి పాత్రకు ప్రాణం పోసిన రష్మిక మందన్న ‘థాంక్యూ నరేంద్రమోదీ సర్. నిజంగా మాకిది గౌరవం’ అని అన్నారు. ఛావాను అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని డిమాండ్లు రావడం తెలిసిందే.
News February 22, 2025
సెంచరీతో చెలరేగిన డకెట్.. AUS టార్గెట్ ఎంతంటే?

CT-2025లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ సెంచరీతో కదం తొక్కడంతో ఆ జట్టు 351 పరుగుల భారీ స్కోర్ చేసింది. 17 ఫోర్లు, 3 సిక్సులతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో CTలో తొలిసారి 150, అత్యధిక వ్యక్తిగత స్కోర్(165) చేసిన బ్యాటర్‌గా రికార్డ్ సృష్టించారు. మరో బ్యాటర్ జో రూట్ 68 పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో బెన్ 3, జంపా, లబుషేన్ తలో 2 వికెట్లు తీశారు.
News February 22, 2025
మళ్లీ థియేటర్లలోకి ‘యుగానికి ఒక్కడు’

తమిళ స్టార్ నటుడు కార్తీ హీరోగా సెల్వరాఘవన్ తెరకెక్కించిన ‘యుగానికి ఒక్కడు’ సినిమా మరోసారి థియేటర్లలో విడుదలవనుంది. 2010 జనవరి 14న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత మార్చి 14న ఈ చిత్రం రీరిలీజ్ కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, USAలో రీరిలీజ్ అవుతుందని తెలుపుతూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.