News January 24, 2025

తీవ్ర నిరాశలో వైసీపీ శ్రేణులు

image

YCP అధినేత జగన్ వ్యూహాల వెనుక విజయసాయిరెడ్డిది కీలకపాత్ర. 2004 నుంచి జగన్ వెంట నడుస్తున్నారు. అక్రమాస్తుల కేసుల్లో జగన్‌తో పాటు జైలు జీవితం గడిపారు. వైసీపీ స్థాపించినప్పటి నుంచి తెర వెనుక వ్యూహరచన, తెర ముందు రాజకీయ విమర్శలతో పెద్దదిక్కుగా మారారు. 2019లో అధికారంలోకి వచ్చాక ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు నడిపారు. రేపు VSR రాజీనామా చేయనుండటంతో జగన్ ఒంటరవుతారని YCP ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు.

Similar News

News November 25, 2025

‘వేములవాడ రాజన్నా.. నీ సొమ్ము భద్రమేనా..?’

image

వేములవాడ రాజన్న స్వామి దేవస్థానం సొమ్ము భద్రమేనా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సత్తమ్మ అనే పత్తి రైతు ఆధార్ నంబర్‌కు రాజన్న ఆలయ ట్రస్టు బ్యాంకు ఖాతా లింకై ఉన్నట్లు వెలుగులోకి రావడంతో ఆలయ సొమ్ము భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రైవేటు వ్యక్తి ఆధార్ కార్డు ప్రభుత్వ అధీనంలో ఉండే ఆలయ ట్రస్టు ఖాతాకు అనుసంధానం కావడానికి కారణం ఏంటన్నది తేలాల్సి ఉంది. దీనిపై విచారణ చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది.

News November 25, 2025

కుర్రాళ్ల ఓపికకు ‘టెస్ట్’!

image

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో మన కుర్రాళ్లు తేలిపోతున్నారు. ఒకప్పుడు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ రోజుల తరబడి క్రీజులో నిలబడేవారు. బౌలర్ల సహనాన్ని పరీక్షించేవారు. కానీ ఇప్పుడున్న ప్లేయర్లు పరుగులు చేయడం అటుంచితే కనీసం గంట సేపైనా ఓపికతో మైదానంలో ఉండలేకపోతున్నారు. కోహ్లీ, రోహిత్, పుజారా, రహానేల తర్వాత టెస్టుల్లోకి వచ్చిన పంత్, నితీశ్, సుదర్శన్, జురెల్ దారుణంగా విఫలమవుతున్నారు.

News November 25, 2025

భార్య గర్భంతో ఉంటే.. భర్త ఇవి చేయకూడదట

image

భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు చేయకపోవడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ‘చెట్లు నరకడం, సముద్ర స్నానం చేయడం శ్రేయస్కరం కాదు. అలాగే క్షౌరం కూడా చేయించుకోకూడదు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చావు ఇంటికి వెళ్లడం మంచిది కాదు. శవాన్ని మోయడం అశుభంగా భావిస్తారు. గృహ ప్రవేశం, వాస్తు కర్మలు వంటివి కూడా చేయకూడదు. ఈ నియమాలు పాటిస్తే దీర్ఘాయువు గల బిడ్డ జన్మిస్తుంది’ అని సూచిస్తున్నారు.