News June 25, 2024
వైసీపీ పాలన పీడకల: చంద్రబాబు

AP: గత ఐదేళ్ల వైసీపీ పాలన రాష్ట్రానికి పీడకల వంటిదని, అలాంటి పాలనను తాను ఎప్పుడూ చూడలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఏ తప్పూ చేయకున్నా 30 మంది టీడీపీ కార్యకర్తలను జైలులో పెట్టారని కుప్పం బహిరంగసభలో దుయ్యబట్టారు. కుప్పంలో రౌడీయిజం చేస్తే ఉపేక్షించబోమని, వారికి ఇదే చివరి రోజని హెచ్చరించారు. మంచి వాతావరణ పరిస్థితులు ఉండే ఈ నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.
Similar News
News December 26, 2025
చైనాతో సై అంటున్న భారత్!

చైనా ఎప్పటికైనా జిత్తులమారే అని గ్రహించిన భారత్.. సరిహద్దుల్లో మౌలిక వసతుల నిర్మాణాలను వేగవంతం చేస్తోందని అమెరికాకు చెందిన Wall Street Journal పేర్కొంది. 2020 బార్డర్ ఫైట్‌లో చైనా కొన్ని గంటల్లోనే ఆర్మీని తరలించగా ఇండియాకు వారం పట్టిందని తెలిపింది. దీంతో రోడ్లు, టన్నెల్స్, ఎయిర్ స్ట్రిప్స్ నిర్మాణాల కోసం Border Roads Organization బడ్జెట్‌ను $280 మిలియన్ల నుంచి $810 మి.కు పెంచిందని వివరించింది.
News December 26, 2025
దత్తాత్రేయునికి 3 తలలు, 6 చేతులు ఎందుకు?

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఏక స్వరూపమే దత్తాత్రేయుడు. అత్రి మహర్షి, అనసూయ దేవిల పుత్రుడైన దత్తుని 3 తలలు సృష్టి, స్థితి, లయకారక శక్తికి, ఆరు చేతులు సర్వదిక్కుల వ్యాప్తికి సంకేతాలు. ప్రకృతిలోని 24 అంశాలను గురువులుగా స్వీకరించిన ఈయన విశ్వగురువు. ఆయనను పూజించి అన్నదానం చేయడం వల్ల విశేష ఫలితాలుంటాయని నమ్మకం. దత్తాత్రేయుని ఆరాధిస్తే అటు గురువు, ఇటు దైవం ఇద్దరి అనుగ్రహం లభించి ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది.
News December 26, 2025
త్రీమెన్ కమిటీలో రైతులుండాల్సిందే: రైతు JAC

AP: మంత్రులు పెమ్మసాని, నారాయణ, MLA శ్రవణ్‌లతో కూడిన కమిటీ ఏ ఒక్క అంశాన్నీ పరిష్కరించలేదని అమరావతి రైతు JAC నేతలు విమర్శించారు. కమిటీ ఏ సమాచారమూ ఇవ్వడం లేదన్నారు. పూలింగ్‌కు ఇవ్వని భూముల్లో కాకుండా వేరే చోట ప్లాట్లు ఇవ్వాలని, గ్రామాల పరిధిలోనే శ్మశానాలుండాలని కోరారు. R5 జోన్ సమస్య మార్చిలోగా పరిష్కరించాలన్నారు. కమిటీలో రైతులనూ చేర్చాలని విన్నవించారు. నిన్న జరిగిన JAC భేటీలో పలు తీర్మానాలు చేశారు.


