News November 4, 2024
ముచ్చుమర్రి బాలిక కుటుంబానికి వైసీపీ రూ.10 లక్షల సాయం

AP: నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని వైసీపీ ఆదుకుంది. పార్టీ తరఫున రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించింది. ఆ పార్టీ నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసానిచ్చారు. జులై 7న బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి చంపి ఓ కాలువలో పడేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ చిన్నారి మృతదేహం ఆచూకీ దొరకలేదు. నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు.
Similar News
News December 6, 2025
భారీ జీతంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News December 6, 2025
గుడికెళ్లి, దేవుడిని దర్శిస్తే పుణ్యం లభిస్తుందా?

ఆలయాలకు వెళ్లడం అంటే కేవలం దేవుడిని చూడటం కాదు. విగ్రహారాధనలోని రహస్యాన్ని, దర్శనం పరమార్థాన్ని తెలుసుకోవాలి. భగవంతుని గొప్ప లీలలు, గుణాలను మనసులో తలుచుకోవాలి. ఆయనే మనకు శరణం అని గుర్తించాలి. నిరంతరం ఆయనపై ధ్యానం ఉంచుతూ, ఆయనకు నచ్చిన మంచి పనులు చేయాలి. కేవలం దర్శనం కాకుండా, ఈ సత్యాన్ని గ్రహిస్తేనే మనం జీవితంలో మోక్షాన్ని సాధించగలం. <<-se>>#Bakthi<<>>
News December 6, 2025
టైప్ 5 డయాబెటిస్ సింప్టమ్స్ ఏంటో తెలుసా?

* న్యూట్రిషన్ డెఫిషియన్సీతో చర్మం, జుట్టు రంగుమారడం.
* లాలాజల గ్రంథుల్లో మార్పులు.
* రోగనిరోధక శక్తి తగ్గడంతో తరచూ చర్మం, చిగుళ్లు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల బారిన పడడం.
* BMI (18.5) కంటే తక్కువ ఉండడం.
* దీర్ఘకాల పోషకాహార లోపం వల్ల ఎదుగుదల ఆగిపోవడం వంటివి టైప్-5 డయాబెటిస్ లక్షణాలు.
* అధిక దాహం, ఒకేసారి బరువు తగ్గడం, నీరసం, కంటిచూపు తగ్గడం డయాబెటిస్ ముఖ్య లక్షణాలు.


