News December 6, 2024
వైసీపీ సంచలన ట్వీట్

శ్రీకాకుళంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడు రమణ ఘరానా <<14802527>>మోసం<<>> బట్టబయలు అయిందని YCP సంచలన ట్వీట్ చేసింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలకు శిక్షణ పేరుతో సెంటర్‌కి వచ్చిన అమ్మాయిల గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేశారని ఆరోపించింది. ఈ విషయాన్ని బయటపెట్టిన కుర్రాళ్లను చిత్రహింసలు పెట్టారంది. నిందితుడు శ్రీకాకుళం MLA గొండు శంకర్‌కి సన్నిహితుడు అని పేర్కొంది.
Similar News
News March 11, 2026
‘టీ’తో హెల్తీ కాంబినేషన్స్ ఇవే..

టీ తాగేటప్పుడు బిస్కెట్లు, రస్క్‌లు, ఫ్రైడ్ స్నాక్స్ తింటుంటారు. కానీ వీటి వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా బరువు పెరగడం, డయాబెటిస్ వంటి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటికి బదులు వేయించిన శనగలు, పల్లీలు, నట్స్, డ్రైఫ్రూట్స్, మఖానా వంటి ఫైబర్, ప్రొటీన్ రిచ్ స్నాక్స్ తీసుకుంటే బెటర్. టీ తాగిన తర్వాత లేదా ముందు ఫ్రూట్స్, స్ప్రౌట్స్, పనీర్ క్యూబ్స్ తిన్నా మంచిదే.
News March 11, 2026
ట్రంప్ కీలక నిర్ణయం.. రిలయన్స్‌తో భారీ డీల్

అమెరికాలోని టెక్సాస్‌లో భారీ ఆయిల్ రిఫైనింగ్ ప్రాజెక్టును అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత USలో ఏర్పాటవుతున్న తొలి రిఫైనరీ ఇదే. ఈ $300 బిలియన్ల ప్రాజెక్టులో రిలయన్స్ పార్ట్‌నర్‌గా చేరుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అందుకు కంపెనీకి థాంక్స్ చెప్పారు. ఇది ప్రపంచంలోనే క్లీన్లీయెస్ట్ రిఫైనరీ అని, వేలాది ఉద్యోగాలు రావడమే కాకుండా అమెరికా ఎనర్జీ సెక్యూరిటీ పెరుగుతుందని పేర్కొన్నారు.
News March 11, 2026
రాష్ట్ర ప్రజలకు CM ఉగాది కానుక

AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు ఉగాది కానుక ప్రకటించారు. ఉగాది రోజున 2.50 లక్షల మంది లబ్ధిదారుల సామూహిక నూతన గృహ ప్రవేశ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. వారికి ప్రభుత్వం తరఫు నుంచి అధికారిక లేఖ వెళ్లేలా చూడాలని ఆదేశించారు. కాగా 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు.


