News July 22, 2024

వైసీపీ అధికార ప్రతినిధి అరెస్ట్

image

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి ఏపీకి వస్తుండగా కుప్పం సమీపంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా తన వ్యాఖ్యలతో నాగార్జున వివాదాల్లో ఉన్నారు. చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పైనా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై టీడీపీ ఫిర్యాదు చేసింది.

Similar News

News November 25, 2025

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ అమలు

image

ఎన్నికల మోడల్ కోడ్ వెంటనే అమల్లోకి వస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పత్రాలను బుధవారం మరోసారి పరిశీలించాలని RDOలు, ఎంపీడీవోలను ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల్లో పోలీసు బందోబస్త్ పెట్టాలని సూచించారు. స్టేజ్-1 రిటర్నింగ్ అధికారులకు మళ్లీ శిక్షణ ఇవ్వాలని, రిపోర్టులు వెంటనే పంపాలని తెలిపారు. ప్రజలు, పార్టీలు, మీడియా సహకరించాలని కోరారు.

News November 25, 2025

పోలీసుల రూల్స్ కేవలం హిందువులకేనా?: రాజాసింగ్

image

TG: అయ్యప్ప మాల వేసుకున్న హైదరాబాద్ కంచన్‌బాగ్ ఎస్సైకి ఉన్నతాధికారులు మెమో జారీ చేయడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. పోలీసుల రూల్స్ కేవలం హిందువులకే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ముస్లిం సోదరులకు ఫ్రీడమ్ ఇచ్చి హిందూ పోలీసులకు ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. రంజాన్ సమయంలో ఇలాంటి రూల్స్ ఎందుకు పెట్టరని మండిపడ్డారు. చట్టాలు అందరికీ సమానంగా ఉండాలని సూచించారు.

News November 25, 2025

వాస్తు శాస్త్రం ప్రకారం.. పడక గది ఏ దిశలో ఉంటే మంచిది?

image

ఇంటి విస్తీర్ణంతో సంబంధం లేకుండా పెద్దవారి ప్రధాన పడక గది నైరుతి దిశలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పిల్లల గది వాయువ్య దిశలో ఉండటం మంచిదని చెబుతున్నారు. ‘ఈ దిశల అమరిక నిద్ర నాణ్యతను పెంచుతుంది. నిద్ర సుఖాన్ని మెరుగుపరుస్తుంది. నైరుతి స్థిరత్వాన్ని ఇవ్వగా, వాయువ్యం చైతన్యానికి మద్దతునిస్తుంది’ అని ఆయన వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>