News June 4, 2024

రాయలసీమలో వైసీపీకి ఘోర పరాభవం

image

AP: రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి ఊహించని పరాభవం ఎదురవుతోంది. 52 స్థానాలకు గాను కేవలం 9 చోట్ల ఆధిక్యంలో ఉంది. పులివెందుల, రాజంపేట, రాయచోటి, బద్వేల్, పుంగనూరు, తంబళ్లపల్లి, మంత్రాలయం, సత్యవీడు, ఆలూరు నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీ లీడింగ్ కనబరుస్తోంది.

Similar News

News November 17, 2025

అలంపూర్: ఈనెల 19 నుంచి ప్రపంచ వారసత్వ వారోత్సవాలు

image

ఈనెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ వారోత్సవాలు అలంపూర్ సంగమేశ్వర సముదాయంలో నిర్వహిస్తున్నట్లు పురావస్తు శాఖ అధికారి వెంకటయ్య తెలిపారు. వారోత్సవాలకు సూపరింటెండెంట్ నిఖిల్ దాస్, జిల్లా కలెక్టర్ సంతోష్‌ను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. సంస్కృతి, సాంప్రదాయాలు చారిత్రక కట్టల గురించి విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.

News November 17, 2025

WGL: మక్కలు(బిల్టీ) క్వింటాకు రూ.2,080

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి మొక్కజొన్న సోమవారం తరలివచ్చింది. అయితే, గతవారంతో పోలిస్తే నేడు మొక్కజొన్న ధర తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు. గతవారం మక్కలు(బిల్టీ) క్వింటాకు రూ.2,090 పలకగా.. ఈరోజు రూ.2,080కి చేరింది. అలాగే, దీపిక మిర్చికి రూ.18వేల ధర వచ్చింది. మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా కొనసాగాయి.

News November 17, 2025

MDK: నిరుపేదలకు అండగా మంత్రి దామోదర్

image

మెదక్ జిల్లాలోని బొడ్మట్ పల్లి గ్రామానికి చెందిన ఎండీ.ఇర్ఫాన్ గత కొన్నిరోజులుగా కిడ్నీల సంబందిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైద్య ఆరోగ్య మంత్రి దామోదర్ తక్షణమే స్పందించి ఉస్మానియా హాస్పిటల్ సంబంధిత వైద్యులతో తానే మాట్లాడి, మెరుగైన వైద్యం కోసం స్వయంగా అంబులెన్స్ పంపి ఉస్మానియా హాస్పటల్‌కి పంపించారు. ఇర్ఫాన్ ఆరోగ్యం తన బాధ్యత అని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.