News June 11, 2024

Xలో YCP, TDP నేతల ట్వీట్స్ వార్

image

గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌ కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖలకు సహాయ మంత్రి కావడంపై కొందరు YCP సపోర్టర్లు సెటైర్లు వేస్తున్నారు. ‘25 ఏళ్లకు పైగా USలో గడిపిన వ్యక్తి భారత్‌లో గ్రామీణాభివృద్ధి కోసం పనిచేస్తాడట. భారత ప్రభుత్వం ఓ జోక్‌లా ఉంది’ అని Xలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై TDP శ్రేణులు స్పందిస్తూ.. ‘16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి CM అవ్వలేదా?’ అని కౌంటర్ ఇస్తున్నారు.

Similar News

News January 21, 2026

JAN 25 లేదా 26న ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి వివేక్

image

TG: ఈ నెల 25 లేదా 26న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మెదక్(D) నర్సాపూర్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. మరోవైపు ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎస్ఈసీ రాణికుముదిని ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News January 21, 2026

అవసరమైతే హరీశ్ రావును మళ్లీ విచారిస్తాం: సజ్జనార్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో అవసరమైతే హరీశ్ రావును మళ్లీ విచారణకు పిలుస్తామని HYD CP, సిట్ చీఫ్ సజ్జనార్ తెలిపారు. ‘ఈ కేసులో హరీశ్‌ను ఇవాళ విచారించాం. ఆయనకు సుప్రీంకోర్టులో స్టే రాలేదు. తన కుమారుడు అమెరికా వెళ్తున్న కారణంగా ముందుగా బయల్దేరి వెళ్లేందుకు ఆయనకు అనుమతి ఇచ్చాం. కేసులో సాక్షులను ప్రభావితం చేయొద్దని సూచించాం’ అని చెప్పారు. ఇవాళ 7గంటలకు పైగా హరీశ్ రావును సిట్ ప్రశ్నించిన విషయం తెలిసిందే.

News January 20, 2026

గూగుల్ క్లౌడ్, IBM CEOలతో చంద్రబాబు భేటీ

image

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్‌ కురియన్‌తో AP CM చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, జాప్యం లేకుండా సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలని CBN కోరారు. IBM ఛైర్మన్ అరవింద్ కృష్ణతోనూ CM సమావేశం అయ్యారు. అమరావతిలో నిర్మించే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌పై చర్చించారు.