News August 22, 2024
ప్రమాదంపై వైసీపీ vs టీడీపీ

AP: అచ్యుతాపురం పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై టీడీపీ, వైసీపీ విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, తమ ప్రభుత్వంలో తెచ్చిన ప్రమాణాలను అటకెక్కించారని YCP విమర్శించింది. ప్రజల శవాలపై వైసీపీ రాజకీయం చేస్తోందని టీడీపీ మండిపడింది. వైసీపీ హయాంలో 16 ఘటనలు జరిగి 70 మంది చనిపోయారని, ఇవేనా మీరు తెచ్చిన భద్రతా ప్రమాణాలు అని కౌంటర్ ఇచ్చింది.
Similar News
News December 23, 2025
రూ.118 కోట్లలో సగం చెల్లించాల్సిందే.. ‘గీతం’కు హైకోర్టు షాక్

TG: హైకోర్టు ఆదేశాలతో HYD <<18584831>>గీతం<<>> యూనివర్సిటీకి అధికారులు కరెంట్ నిలిపివేశారు. దీంతో 8వేల మంది స్టూడెంట్స్ నష్టపోతున్నారని వర్సిటీ మరోసారి కోర్టుకు వెళ్లింది. రూ.118 కోట్ల బకాయిల్లో సగం కడితేనే కరెంట్ కనెక్షన్ పునరుద్ధరణకు ఆదేశిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. కాగా రూ.118 కోట్ల బకాయిలు చెల్లించాలని ఇటీవల వర్సిటీకి డిస్కం నోటిసులిచ్చిన విషయం తెలిసిందే.
News December 23, 2025
శీతాకాలంలో మడమలు ఎందుకు పగులుతాయంటే?

* శీతాకాలంలో పొడి వాతావరణం వల్ల గాలిలో తేమ తగ్గి చర్మం పొడిబారడం, మడమలు పగలడం వంటి సమస్యలు వస్తాయి.
* సోరియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, తామర వంటి చర్మ సమస్యల వల్ల కూడా మడమల పగుళ్లు ఏర్పడతాయి. డయాబెటిస్, థైరాయిడ్ పరిస్థితులు కూడా మడమలు పగుళ్లకు కారణమవుతాయి.
* ఈ సీజన్లో చాలా మంది తక్కువగా నీరు తాగుతారు. దీనివల్ల శరీరంలో తేమ లోపిస్తుంది. ఇలా చర్మం పొడిగా మారి మడమల పగుళ్లకు కారణమవుతుంది.
News December 23, 2025
పంచముఖ హనుమత్ స్తోత్రాన్ని ఎందుకు పఠించాలి?

పంచముఖ హనుమంతుడు 5 విశిష్ట శక్తుల సమ్మేళనం. ఆయన స్తోత్రాన్ని పఠిస్తే భయం, శత్రుపీడ, గ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. 5 ముఖాలు 5 రకాల అనుగ్రహాలను ఇస్తాయి. వానర ముఖం కోరికలను తీర్చగా, నరసింహ రూపం విజయాన్ని, గరుడ రూపం విష భయాల నుంచి రక్షణను, వరాహ ముఖం ఐశ్వర్యాన్ని, హయగ్రీవ రూపం జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. మానసిక ప్రశాంతత కోసం, సంకల్ప బలం పెరగడం కోసం నిత్యం ఈ స్తోత్రాన్ని పఠించాలి.


