News September 23, 2025

మండలి నుంచి వైసీపీ వాకౌట్

image

ఏపీ శాసన మండలి నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. అట్రాసిటీ కేసులపై చర్చ సందర్భంగా ‘మాపై గొడ్డలి వేటు, కోడికత్తి, అమ్మా, చెల్లి కేసులు లేవు’ అని హోం మంత్రి అనిత YCPపై సెటైర్లు వేశారు. దీంతో ఆమె వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామంటూ YCP ఎమ్మెల్సీలు బయటికి వెళ్లిపోయారు.

Similar News

News September 23, 2025

GSTతో రాష్ట్రానికి రూ.7 వేల కోట్ల నష్టం: పొన్నం

image

TG: ప్రజలను దోచుకునేందుకు GSTని కేంద్రం ఆయుధంగా వాడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ‘GST అంటే గబ్బర్‌సింగ్ ట్యాక్స్ అని రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పారు. శవపేటికలపై కూడా కేంద్రం ట్యాక్స్ విధించింది. 8 ఏళ్లు ప్రజలను దోచుకుంది. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి GST తగ్గించింది. దీంతో రాష్ట్రానికి రూ.7వేల కోట్ల నష్టం వాటిల్లుతుంది. దాన్ని కేంద్రమే పూడ్చాలి’ అని డిమాండ్ చేశారు.

News September 23, 2025

ఈ అలవాట్లు అందానికి శత్రువులు

image

మచ్చలు లేకుండా అందంగా మెరుస్తూ ఉండే చర్మం కావాలని ప్రతి అమ్మాయీ కోరుకుంటుంది. అయితే దీనికోసం కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు చర్మనిపుణులు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం, పాల ఉత్పత్తులు మితంగా తీసుకోవాలి. చక్కెర, జంక్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. ఎవరో చెప్పారని చర్మంపై ప్రయోగాలు చెయ్యకూడదు. కంటినిండా నిద్ర చర్మ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. పడుకొనే ముందు మేకప్ తొలగించాలి. నీరు ఎక్కువగా తాగాలి.

News September 23, 2025

పాలస్తీనా దేశం అనేది ఉండదు: నెతన్యాహు

image

పాలస్తీనాను దేశంగా గుర్తిస్తూ UK, కెనడా, AUS తదితర దేశాలు ప్రకటించడంపై ఇజ్రాయెల్ PM నెతన్యాహు ఫైరయ్యారు. ‘పాలస్తీనా దేశం అనేది ఉండదు. మా భూభాగంలో టెర్రర్ స్టేట్‌ ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాన్ని ఎదుర్కొంటాం. OCT 7న మారణకాండ సృష్టించిన టెర్రరిస్టులకు మీరు భారీ బహుమతి ఇస్తున్నారు. విదేశాలతో పాటు స్వదేశంలో వ్యతిరేకత ఎదురైనా టెర్రర్ స్టేట్ ఏర్పాటును ఆపాను. ఇక ముందు కూడా అది జరగదు’ అని స్పష్టంచేశారు.