News June 4, 2024
ఈ జిల్లాలో ఖాతా తెరవని వైసీపీ

AP: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ 8 ఉమ్మడి జిల్లాల్లో ఖాతానే తెరవలేదు. శ్రీకాకుళం, విజయనగరం, తూ.గో, ప.గో, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లోని నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులెవరూ గెలవలేదు. ఆయా జిల్లాలను కూటమి పార్టీలు ఊడ్చిపారేశాయి. కాగా వైసీపీ కేవలం 11 సీట్లే దక్కించుకుంది.
Similar News
News November 21, 2025
సచివాలయ ఉద్యోగుల బదిలీలకు నేటి నుంచి దరఖాస్తులు

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. స్పౌజ్ కోటా ట్రాన్స్ఫర్ల ప్రక్రియను ప్రభుత్వం ఈనెల 30 లోగా పూర్తి చేయనుంది. <<18316925>>అర్హులైన<<>> వారు ఈనెల 24లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 25, 26 తేదీల్లో పరిశీలించి, సీనియారిటీ ప్రకారం జాబితాలు ప్రకటిస్తారు. 29వ తేదీకల్లా బదిలీల ఆర్డర్ జారీ చేయడంతోపాటు సచివాలయాల కేటాయింపు పూర్తి చేయనున్నారు.
News November 21, 2025
గిల్‌కు నేడు ఫిట్నెస్ టెస్ట్

సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్ గిల్ ఫిట్నెస్ టెస్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. టీమ్‌తోపాటు గువాహటి వెళ్లిన గిల్.. నిన్న ప్రాక్టీస్‌కు హాజరుకాలేదు. అతడు మ్యాచ్ ఆడే ఛాన్స్‌లు తక్కువేనని సమాచారం. గిల్ కోలుకుంటున్నారని, ఇవాళ సాయంత్రం ఫిజియోలు, డాక్టర్లు తుది నిర్ణయం తీసుకుంటారని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. తొలి టెస్టులో మెడ నొప్పితో గిల్ మైదానాన్ని వీడటం తెలిసిందే.
News November 21, 2025
గుమ్మానికి నిమ్మ, మిరపకాయ ఎందుకు కడతారు?

ఇళ్లు, షాప్ గుమ్మాలకు, వాహనాలకు నిమ్మ, మిరపకాయలు కడుతుంటారు. ఇది చెడు దృష్టిని తొలగిస్తుందని నమ్మకం. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పదార్థాల వాడకం పెంచేందుకే పూర్వీకులు ఈ పద్ధతిని ప్రోత్సహించారని అంటారు. ఇలా కడితే ఇంటి చుట్టూ ఉండే వాతావరణం శుభ్రమవుతుంది. వాహనాలకు వీటిని తగిలించడం వలన వీటిలోని సానుకూల శక్తి చుట్టూ ఉండే చెడు దృష్టిని తొలగించి, ప్రమాదాలు జరగకుండా కాపాడుతుందని విశ్వాసం.


