News February 24, 2025
YCPకి ప్రతిపక్ష హోదా రాదు: Dy.CM పవన్

AP: ‘ఈ ఐదేళ్లలో YCPకి ప్రతిపక్ష హోదా రాదు.. ఇది గుర్తుపెట్టుకోవాలి’ అని Dy.CM పవన్ తేల్చిచెప్పారు. 11 సీట్లు ఉన్న YCPకి ఆ హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వచ్చేదన్నారు. ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్లాలంటూ ఎద్దేవా చేశారు. హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం, లేకపోతే ప్రసంగాలను అడ్డుకుంటామనడం సరైన పద్ధతి కాదని చెప్పారు.
Similar News
News February 24, 2025
KCR, హరీశ్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్

TG: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో BRS అధినేత KCR, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మేడిగడ్డ కుంగడంపై రాజలింగమూర్తి అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై భూపాలపల్లి క్రిమినల్ కోర్టు కేసీఆర్, హరీశ్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించారు.
News February 24, 2025
YS జగన్ కీలక నిర్ణయం

AP: శాసనసభకు YCP అధినేత జగన్, ఆ పార్టీ MLAలు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. MLAలు, MLCలతో భేటీలో జగన్ ఈ విషయం వెల్లడించారు. మండలిలో బలం ఉన్నందున MLCలు హాజరుకావాలని ఆదేశించారు. అసెంబ్లీకి వెళ్లకపోయినా ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. మండలిలో సమస్యలను బలంగా ప్రస్తావించాలన్నారు. YCPకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
News February 24, 2025
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 856 పాయింట్ల నష్టంతో 75,454 వద్ద, నిఫ్టీ 242 పాయింట్ల నష్టంతో 22,553 వద్ద ఎండ్ అయ్యాయి. M&M, రెడ్డీస్ ల్యాబ్స్, హీరో మోటో కార్ప్, కొటక్ మహీంద్ర సంస్థల షేర్లు భారీ లాభాలను అందుకున్నాయి. విప్రో, HCL, TCS, ఇన్ఫోసిస్, ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.