News April 25, 2024
వైసీపీకి డిపాజిట్లు కూడా రావు: చంద్రబాబు

AP: ఎన్డీఏ సభలకు వస్తున్న ఆదరణ చూసి వైసీపీలో గుబులు మొదలైందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ‘ప్రజలందరినీ జగన్ తన బానిసలుగా చూస్తున్నారు. జగన్ అహంకారి, విధ్వంసకారుడు. ఎన్నికలప్పుడు ఏదో ఒక నాటకం ఆడటం జగన్కు అలవాటు. ఇప్పడు గులకరాయి డ్రామా ఆడుతున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావు. ప్రజల కలలు చెరిపేసిన దుర్మార్గుడు జగన్’ అని ఆయన విరుచుకుపడ్డారు.
Similar News
News November 14, 2025
తగ్గిన బంగారం ధరలు

నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.770 తగ్గి రూ.1,27,850కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.700 పడిపోయి రూ.1,17,200గా నమోదైంది.
News November 14, 2025
ఒక రౌండ్ అంటే ఏమిటి?

ఎన్నికల ఓట్ల కౌంటింగ్ రోజున ‘రౌండ్’ అనే పదం తరచూ వినిపిస్తూ ఉంటుంది. X అనే వ్యక్తి మొదటి రౌండ్లో ముందంజలో ఉన్నారు అని వింటాం. ఒక రౌండ్ అంటే 14 EVMల ఓట్ల లెక్కింపు. ప్రతి EVM ఒక బూత్ను సూచిస్తుంది. కాబట్టి ఒక రౌండ్ 14 బూత్ల ఓట్ల లెక్కింపు అని కూడా చెప్పొచ్చు. ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఓట్ల లెక్కింపు కోసం EC ఒకేసారి 14 టేబుళ్లను ఉంచుతుంది. ఒక్కో టేబుల్పై ఒక EVM ఉంటుంది.
News November 14, 2025
అలసంద సాగు..అధిక దిగుబడినిచ్చే విత్తనం ఇదే

అలసంద 85 నుంచి 90 రోజుల పంట. దీనికి చల్కా, ఎర్రనేలలు ఈ పంటకు అనుకూలం. అన్ని కాలాల్లో విత్తుటకు టి.పి.టి.సి-29 అనే విత్తన రకం అనుకూలం. ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి కార్బండజిమ్ 2గ్రా. లేదా థైరమ్ 2 గ్రాములతో విత్తన శుద్ధి చేసుకొని తర్వాత విత్తాలి. వరుసకు వరుసకు మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 30 సెంటీమీటర్ల దూరం పాటిస్తూ విత్తుకోవాలి.


