News October 6, 2025

కల్తీ మద్యంపై వైసీపీ ఆరోపణలు.. లోకేశ్ ఆగ్రహం

image

AP: ప్రభుత్వ పెద్దల అండతోనే కల్తీ మద్యం రాకెట్ నడుస్తోందన్న <<17931472>>వైసీపీ<<>> ఆరోపణలపై మంత్రి లోకేశ్ ఫైర్ అయ్యారు. ‘క‌ల్తీ మ‌ద్యం నిందితుల్లో టీడీపీ నేత‌లున్నా మా ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. వారిని మా అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. మీ ఐదేళ్ల పాల‌న‌లో ఏం చేశారో మ‌రిచిపోయి ఆరోప‌ణ‌లు చేయొద్దు. డ‌బ్బు కక్కుర్తితో జే బ్రాండ్స్‌తో వేల మంది ప్ర‌జ‌ల ప్రాణాలు తీశారు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News October 7, 2025

వాహనాలకు ఫైన్లు సరే.. చెత్త సంగతేంటి సార్?: నెటిజన్లు

image

‘నో-పార్కింగ్ జోన్‌లో వాహనాలు కనిపిస్తే ఫైన్ వేయడం, లిఫ్ట్ చేయడం పోలీసులకు సులభం. కానీ రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి మున్సిపల్ సిబ్బంది ఎందుకు ఆలస్యం చేస్తున్నారు?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వాహనాలను లిఫ్ట్ చేస్తే చలాన్ రూపంలో ప్రభుత్వానికి డబ్బు వస్తుందని.. చెత్తతో ఏం రాదంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు?

News October 7, 2025

30 ఏళ్ల క్రితం రూ.1000 పెట్టుబడి.. ఇవాళ రూ.1.83 కోట్లు!

image

షేర్ మార్కెట్‌లో సరైన పెట్టుబడులు భారీగా రిటర్న్స్ ఇస్తాయని మరోసారి రుజువైంది. 30ఏళ్ల క్రితం రూ.వెయ్యితో కొన్న షేర్ల విలువ ఇప్పుడెంత ఉంటుందని ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఓ వ్యక్తి 1995లో JVSLలో రూ.10 చొప్పున 100 షేర్లు కొన్నాడు. JSWలో JVSL విలీనం కాగా ఆ షేర్లు 1600గా, 1:10గా స్ప్లిట్ అయ్యాక 16,000 షేర్లుగా మారాయి. ప్రస్తుతం ఈ షేర్ల విలువ ₹1.83 కోట్లుగా ఉంటుందని పలువురు చెబుతున్నారు.

News October 7, 2025

తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పాలి: కమల్

image

కరూర్ తొక్కిసలాటలో 41 మంది మరణించిన ప్రాంతాన్ని MP కమల్ హాసన్ సందర్శించారు. తప్పును అంగీకరించాలని, క్షమాపణ చెప్పాల్సిన సమయమిదని వ్యాఖ్యానించారు. CM స్టాలిన్ తీసుకున్న చర్యలకు కృతజ్ఞత తెలిపారు. అయితే ఏ ప్రభుత్వానికైనా ఇలాంటి సమయాల్లో బాధ్యత ఉంటుందని చెప్పారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తప్పొప్పులపై మాట్లాడలేనన్నారు. కాగా తన సభలో ఈ ఘటన జరిగినా TVK చీఫ్ విజయ్ ఇప్పటివరకు బాధితుల్ని పరామర్శించలేదు.