News April 1, 2025

CBN, లోకేశ్, పవన్‌పై వైసీపీ ‘ఏప్రిల్ ఫూల్’ ట్వీట్

image

AP: ఏప్రిల్ ఫస్ట్ సందర్భంగా చంద్రబాబుకు డబ్బు కట్ట, లోకేశ్‌కు పాల డబ్బా, పవన్‌కు రిమోట్‌ను సింబల్స్‌గా పెట్టి వైసీపీ సెటైరికల్ ట్వీట్ చేసింది. ‘వెరీ ఫేమస్ పాత్రలు.. స్కామర్ బాబు, పప్పు లోకేశ్, పవన్ కంట్రోల్. ఇప్పుడు మీ సమీపంలోని హెరిటేజ్ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ ఫూల్ కోడ్‌ను ఉపయోగించి 50 శాతం డిస్కౌంట్ పొందండి. లేదా TDPFools కోడ్‌తో 100% తగ్గింపును పొందండి’ అని రాసుకొచ్చింది.

Similar News

News January 10, 2026

శని దోష నివారణ మంత్రాలు

image

జాతకంలో శని దోషాల తీవ్రతను తగ్గించుకోవడానికి ‘ఓం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయ నమః’ అనే మంత్రాన్ని, శని ధ్యాన శ్లోకాలను 19 వేల సార్లు పఠించాలని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల దోషాల నుంచి విముక్తి లభిస్తుందని అంటున్నారు. శని శాంతి మంత్రం, శని పత్ని నామ స్తుతి, శని చాలీసా చదివినా విశేష ఫలితాలుంటాయని సూచిస్తున్నారు. శనివారం నాడు ఈ మంత్రాలను స్మరిస్తే శని బాధలు క్షీణిస్తాయని నమ్మకం.

News January 10, 2026

నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే లైసెన్స్ రద్దు

image

TG: వాహనాలను నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసే వారి లైసెన్సులను రవాణాశాఖ 6 నెలల పాటు రద్దు చేస్తోంది. 2025లో 16వేలకు పైగా లైసెన్సులు రద్దయ్యాయి. డ్రంకెన్ డ్రైవ్, ర్యాష్/రాంగ్ రూట్‌‌లో వెళ్తే పోలీసులు కేసు నమోదు చేస్తారు. రవాణాశాఖ నోటీసులిస్తుంది. వాహనదారుడి వివరణ సంతృప్తికరంగా లేకపోతే లైసెన్స్‌ను రద్దు చేస్తుంది. వారిపై మళ్లీ కేసులు నమోదైతే సస్పెన్షన్‌ను మరో 6 నెలలు లేదా ఏడాదిపాటు పొడిగిస్తారు.

News January 10, 2026

కాలుష్యంలో ఢిల్లీని దాటేసిన బర్నీహాట్

image

దేశంలో కాలుష్యానికి రాజధాని ఢిల్లీనే అనుకుంటే ఈసారి అస్సాంలోని బర్నీహాట్ పట్టణం అంతకు మించిపోయింది. ఢిల్లీని వెనక్కి నెట్టి దేశంలోనే అత్యంత కలుషిత పట్టణంగా నిలిచింది. సీఆర్ఈఏ (Centre for Research on Energy and Clean Air) తాజా నివేదిక ప్రకారం పీఎం2.5, పీఎం10 స్థాయులు ఆందోళనకరంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 44% నగరాలు వాయు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. UPలో అత్యధికంగా 416 నగరాలు ఈ జాబితాలో నిలిచాయి.