News March 8, 2025
12న వైసీపీ ‘యువత పోరు’

AP: విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో వైసీపీ ఈ నెల 12న ఆందోళన చేయనుంది. ఈ నేపథ్యంలో ‘యువత పోరు’ పోస్టర్‌ను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆవిష్కరించారు. ఆ రోజున అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద విద్యార్థులతో కలసి నిరసనలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News January 29, 2026
పేరు మార్చుకోనున్న సమంత?

హీరోయిన్ సమంత మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి తర్వాత భార్య ఇంటి పేరు మారుతుంది. భర్త ఇంటి పేరు భార్య పేరు ముందు పెట్టుకుంటారు. సమంత కూడా రాజ్ నిడిమోరు ఇంటిపేరును చేర్చుకోనున్నట్టు తెలుస్తోంది. SM అకౌంట్లతోపాటు ప్రస్తుతం చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ టైటిల్స్‌లోనూ ‘సమంత నిడిమోరు’ పేరును అభిమానులకు పరిచయం చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
News January 29, 2026
అమరావతి రైతులకు మిక్స్డ్ యూజ్ రిటర్నబుల్ ప్లాట్లు!

AP: అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్‌లో రైతులకు మిక్స్డ్ యూజ్ రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలిదశలో వాణిజ్య, నివాస ప్లాట్లు వేర్వేరుగా ఇచ్చారు. దీనివల్ల ఒకే పార్సిల్‌గా కాకుండా చిన్న ముక్కలుగా మారి కేటాయింపు ఇబ్బంది అయ్యింది. ఈసారి ల్యాండ్ పార్సిల్ ఒకేచోట ఉండేలా చూస్తున్నారు. మిక్స్డ్ యూజ్ నిర్మాణాలకు ఫ్లోర్ స్పేస్ ఇండెక్సూ కీలకం కావడంతో దానిపైనా ఆలోచిస్తున్నారు.
News January 29, 2026
SBI 2273 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<


