News September 12, 2024
ఏచూరి భౌతికకాయం AIIMSకు అప్పగింత

అనారోగ్యంతో <<14084560>>చనిపోయిన<<>> సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఎల్లుండి సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు తీసుకురానున్నారు. ఆయనకు చైనా, వియత్నాం, రష్యా, వెనిజుల కమ్యూనిస్టు నేతలు నివాళులర్పించనున్నారు. కాగా బోధన, పరిశోధనల కోసం ఏచూరి భౌతికకాయాన్ని కుటుంబీకులు ఢిల్లీ AIIMSకు డొనేట్ చేశారు.
Similar News
News January 7, 2026
CSLలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(CSL)లో 210 వర్క్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. అభ్యర్థులు టెన్త్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసై ఉండాలి. కేటగిరీల వారీగా గరిష్ఠ వయో పరిమితి 45 ఏళ్ల వరకు ఉంది. ఈ నెల 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక్కడ <
News January 7, 2026
టెన్త్ ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు లాస్ట్ ఛాన్స్

TG: టెన్త్ ఎగ్జామ్స్ ఫీజు చెల్లించేందుకు విద్యాశాఖ చివరి అవకాశం కల్పించింది. తత్కాల్ విధానంలో ₹వెయ్యి లేట్ ఫీజుతో ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పింది. ఆయా తేదీల్లో స్కూల్ HMలకు ఫీజులు చెల్లించాలని పేర్కొంది. హెడ్మాస్టర్లు 28వ తేదీ లోపు చలానా రూపంలో కట్టాలని, 29వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలంది. ఇదే చివరి అవకాశం అని, మరోసారి గడువు పొడిగించబోమని వివరించింది.
News January 7, 2026
శని ప్రభావంతో వివాహం ఆలస్యం

జాతక చక్రంలో వివాహ స్థానంపై శని ప్రభావం ఉంటే పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి. శని మందగమన గ్రహం కావడంతో ప్రతి విషయంలోనూ జాప్యం జరుగుతుంది. దీనికి పరిష్కారంగా ప్రతి శనివారం శివాలయంలో నల్ల నువ్వులతో దీపారాధన చేయాలి. ‘శని గవచం’ పఠించడం, పేదలకు ఆహారం లేదా వస్త్ర దానం చేయడం వల్ల శని ప్రసన్నుడవుతాడు. ముఖ్యంగా హనుమంతుడిని పూజించడం వల్ల శని దోషాలు తొలగి, వివాహ మార్గం సుగమం అవుతుంది.


