News April 3, 2026

YELLOW ALERT: 5 రోజులు వర్షాలు!

image

TG: రాష్ట్రంలో ఎండలు, అకాల వర్షాలతో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. పలు జిల్లాల్లో 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని IMD అధికారులు వెల్లడించారు. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వానలకు ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా 4 రోజుల వర్షాల అప్డేట్ కోసం పై ఫొటోను స్వైప్ చేయండి.

Similar News

News April 15, 2026

మరింత పెరగనున్న వాహనాల ధరలు?

image

నిర్వహణ ఖర్చులు పెరిగాయంటూ ఇప్పటికే ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల ధరలు పెంచుతున్నాయి. యుద్ధం మరింత కాలం కొనసాగితే ఉత్పత్తి వ్యయం పరిమితికి మించి పెరిగి రేట్లు మరింత పెంచాల్సి రావొచ్చని భారత వాహన తయారీదారుల సమాఖ్య(సియామ్) అధ్యక్షుడు శైలేశ్ చంద్ర తెలిపారు. కమోడిటీ ధరలు ఏమేర పెరుగుతాయనేది 4-5 వారాల్లో స్పష్టత రావొచ్చన్నారు. ఆ తర్వాతే వాహనాల రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని వెల్లడించారు.

News April 15, 2026

US-ఇరాన్ చర్చలపై వాన్స్ కీలక వ్యాఖ్యలు

image

అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా నమ్మకం లేకపోవడమే పెద్ద అడ్డంకి అని JD వాన్స్ అభిప్రాయపడ్డారు. దాన్ని తొలగించడం అంత సులభం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సీజ్‌ఫైర్‌ను పూర్తిస్థాయి శాంతి ఒప్పందంగా మార్చడం పెద్ద ఛాలెంజ్ అన్నారు. ఏళ్ల తరబడిగా ఉన్న విభేదాలు ఒక్క రాత్రిలో పరిష్కారం కావని స్పష్టం చేశారు. మరోసారి ఇరుపక్షాలు చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో వాన్స్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

News April 15, 2026

IIGMలో 26 రిసెర్చ్ స్కాలర్ పోస్టులు

image

కాంట్రాక్ట్ పద్ధతిలో 26 రిసెర్చ్ స్కాలర్ పోస్టుల భర్తీకి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జియోమ్యాగ్నటిజం (IIGM), నవీ ముంబై.. దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 60% మార్కులతో MSc పూర్తి చేసిన వారు అర్హులు. వయసు 27 ఏళ్లు మించకూడదు. ఎగ్జామ్, ఇంటర్వ్యూతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీజు – రూ.100. ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవడానికి 30-4-26 చివరి తేదీ. పూర్తి వివరాలకు iigm.res.in/careers చూడండి.