News June 15, 2024
YELLOW ALERT: 5 రోజులు వర్షాలు

TG: రాష్ట్రంలో ఈ నెల 19 వరకు వర్షాలు కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, NRML, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, HYD, VKB, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయంది. ఉరుములు, మెరుపులతోపాటు 30-40Kmph వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
Similar News
News November 18, 2025
‘రాయలసీమ’ పేరుకు నేటికి 97 ఏళ్లు!

బ్రిటిష్ కాలంలో ‘దత్త మండలం’గా పిలవబడిన మన ప్రాంతానికి ‘రాయలసీమ’ అనే పేరు పెట్టి నేటికి 97ఏళ్లు పూర్తయ్యాయి. 1928 నవంబర్ 18న నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో చిలుకూరి నారాయణరావు ఈ పేరును ప్రతిపాదించారు. విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలుకు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ ‘‘రాయలసీమ’’ అనే పేరును ప్రతిపాదించారు. పప్పూరు రామాచార్యులు ఈ ప్రతిపాదనను బలపరచగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
News November 18, 2025
NABFINSలో ఉద్యోగాలు

<
News November 18, 2025
తిరుమల వైభవాన్ని చాటే మహాద్వార గోపురం

శ్రీవారి ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారమే మహద్వార గోపురం. దీన్నే ముఖద్వారం, పడికావలి గోపురమని కూడా అంటారు. సుమారు 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ గోపురం 50ft ఎత్తుతో, 5 అంతస్తులతో ఉంటుంది. దీని శిఖరంపై 7 కలశాలు అలరారుతుంటాయి. మహాప్రాకారానికి తొలి ప్రవేశ ద్వారం ఇదే. అద్భుతమైన ఈ శిల్పకళా రూపం, భక్తులకు స్వామి దర్శనానికి ముందు ఆధ్యాత్మిక అనుభూతిని అందించి, ఆలయ దివ్య వైభవానికి అద్దం పడుతుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>


