News July 8, 2024
YELLOW ALERT.. భారీ వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. మిగతా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Similar News
News December 6, 2025
క్రికెటర్ శ్రీచరణి తండ్రికి రూ.5 లక్షల చెక్కు అందజేత

కడప క్రికెట్ తేజం నల్లపురెడ్డి శ్రీచరణికి జిల్లా TDP అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వ్యక్తిగతంగా ప్రకటించిన రూ.5 లక్షల ప్రోత్సాహక చెక్కును శనివారం MLA మాధవి, క్రికెట్ స్టేడియం ఛైర్మన్ శ్రావణ్ రాజ్రెడ్డి కలిసి ఆమె తండ్రికి అందజేశారు. మహిళా క్రికెట్ వరల్డ్కప్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి కడపకు గర్వకారణమై నిలిచిన శ్రీచరణిని అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
News December 6, 2025
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047 షెడ్యూల్

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్-2047 ఎల్లుండి ప్రారంభం కానుంది. హైదరాబాద్ శివారులోని ఫ్యూచర్ సిటీలో విశాలమైన ప్రాంగణంలో ఈ సదస్సు జరగనుంది. వివిధ దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ నేతలు, దేశంలోని కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు హాజరవనున్నారు. సమ్మిట్ రెండు రోజుల షెడ్యూల్ను ఇక్కడ <
News December 6, 2025
సెల్యూట్ డాక్టర్.. 1.2లక్షల మందికి ఉచితంగా..!

నిస్సహాయులకు వైద్యం అందని చోట డాక్టర్ సునీల్ కుమార్ హెబ్బీ ఆశాదీపంగా మారారు. పేరు కోసం కాకుండా సేవ చేయడానికి తన కారును ‘సంచార క్లినిక్’గా మార్చుకున్నారు. బెంగళూరు వీధుల్లోని పేదలకు ఇంటి వద్దే ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదంతో మొదలైన ఈ గొప్ప ప్రయాణం ఇప్పటికే 1.2 లక్షల మందికిపైగా ప్రాణాలను కాపాడింది. వైద్య పరికరాలతో నిండిన ఆయన కారు ఎంతో మందికి కొత్త జీవితాన్నిస్తోంది.


