News August 27, 2025
ఎల్లో అలర్ట్.. భారీ వర్షాలు

AP: అల్పపీడన ప్రభావంతో అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్లలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న శ్రీకాకుళంలో 16cm, కళింగపట్నం13.3cm, వైజాగ్‌లో 11.8cmల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
Similar News
News August 27, 2025
వచ్చే వారమే ఎన్నికల షెడ్యూల్?

TG: స్థానిక ఎన్నికల షెడ్యూల్ SEP తొలి వారంలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. SEC <<17525625>>ఆదేశాల<<>> నేపథ్యంలో ఈ నెల 30న క్యాబినెట్ భేటీలో దీనిపై క్లారిటీ రానుంది. ముందుగా MPTC, ZPTC ఎన్నికలను వచ్చేనెల చివరి వారంలో నిర్వహించే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత వారానికే అంటే అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయని తెలుస్తోంది. కాగా బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
News August 27, 2025
భారీ వర్షం.. పండగ పనులకు ఆటంకం

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆనందంగా వినాయక చవితి జరుపుకోవాలనుకున్న ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాల వల్ల మండపాలన్నీ తడిచి ముద్దయ్యాయి. పూజా సామగ్రి, ఇతర వస్తువుల కోసం బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ‘ఇవాళ ఒక్కరోజు వర్షాన్ని ఆపు గణపయ్యా’ అని భక్తులు వేడుకుంటున్నారు.
News August 27, 2025
భారీగా పెరగనున్న సిమెంట్ ధరలు?

సిమెంట్ ధరలు భారీగా పెంచేందుకు కంపెనీలు, వ్యాపారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బస్తాకు రూ.30-40 వరకు పెంచే అవకాశమున్నట్లు సమాచారం. త్వరలో కేంద్రం జీఎస్టీ శ్లాబులు తగ్గించనుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సిమెంట్‌పై ఉన్న 28% GST 18 శాతానికి తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జనాలకు ఊరట కలగకుండా తమ లాభాలను పెంచుకోవడానికి కంపెనీలు ముందుగానే ధరలు పెంచుతున్నట్లు సమాచారం.